News February 4, 2025

ములుగు జిల్లాలో సీడీపీఓ ఆత్మహత్యాయత్నం

image

ములుగు జిల్లా వెంకటాపురం మండలం సీడీపీఓ ధనలక్ష్మి కత్తితో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. మంగళవారం ఉదయం పాలు తీసుకువచ్చిన కార్ డ్రైవర్ సీడీపీవో ఇంట్లో స్పృహ తప్పి ఉండడం చూసి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 25, 2025

నా ఫొటో, పేరు చూసి మోసపోవద్దు: CP సజ్జనార్

image

సైబర్ క్రైమ్‌ మోసాలపై CP సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు. ‘వాట్సాప్‌లో DPగా నా ఫొటోను పెట్టుకుని తెలిసిన వాళ్లకు సందేశాలు పంపిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇవి నకిలీ ఖాతాలు. పూర్తిగా మోసపూరితమైనవి. ఇలాంటి సందేశాలకు స్పందించకండి. ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి. వ్యక్తిగత వివరాలను ఇవ్వొద్దు. డబ్బులు అడిగితే పంపించొద్దు.’ అని ఆయన ట్వీట్ చేశారు.
SHARE IT

News October 25, 2025

కర్నూలు బస్సు ప్రమాదం.. సోనూసూద్ రిక్వెస్ట్

image

కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో నటుడు సోనూసూద్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఓ విజ్ఞప్తి చేశారు. ‘ప్రతి లగ్జరీ బస్సులో ఎమర్జెన్సీ డోర్ ఎలక్ట్రానిక్ కాకుండా మాన్యువల్‌ది పెట్టాలి. ఆపరేటర్లకు నెల సమయం ఇవ్వండి. పర్మిట్ రెన్యూవల్ సమయంలో ఆపరేటర్లు డోర్ మార్చినట్లు ఫొటోలు అప్‌లోడ్ చేయాలని చెప్పండి. నితిన్ గడ్కరీ సార్ చర్యలు తీసుకోండి. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడకండి’ అని ట్వీట్ చేశారు.

News October 25, 2025

డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలో ఉద్యోగాలు

image

<>DRDO <<>>అనుబంధ సంస్థ డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ 5 రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. MS, MSc, ME, M.TECH, పీహెచ్‌డీ, బీఈ, బీటెక్, నెట్, గేట్ అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in/