News February 4, 2025

ములుగు జిల్లాలో సీడీపీఓ ఆత్మహత్యాయత్నం

image

ములుగు జిల్లా వెంకటాపురం మండలం సీడీపీఓ ధనలక్ష్మి కత్తితో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. మంగళవారం ఉదయం పాలు తీసుకువచ్చిన కార్ డ్రైవర్ సీడీపీవో ఇంట్లో స్పృహ తప్పి ఉండడం చూసి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 10, 2026

అనకాపల్లి టీడీపీలో ముదురుతున్న పెట్రోల్ బంక్ రాజకీయం

image

అనకాపల్లిలో డీసీఎంఎస్ స్థలంలో ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంక్ టీడీపీలో రాజకీయ దుమారం రేపుతోంది. డీసీఎంఎస్ ఛైర్మన్‌గా టీడీపీకి చెందిన కోట్ని బాలాజీ బాధ్యతలు తీసుకున్న తరువాత పెట్రోల్ బంక్ పనులు జరుగుతున్న సమయంలో గత శనివారం మాజీ మంత్రి డీవీఆర్ తనయుడు రత్నాకర్ హైరానా చేసినట్లు సమాచారం. దీంతో ఈ సమస్యను పార్టీలోని ఇరువర్గాలు మంత్రి లోకేశ్ దృష్టికి వెళ్లినట్లు పార్టీ పెద్దలు పేర్కొన్నారు.

News February 10, 2026

టీనేజ్ ప్రెగ్నెన్సీలో ‘రెడ్ జోన్’లో అనంతపురం

image

అనంతపురం జిల్లాలో టీనేజ్ ప్రెగ్నెన్సీ శాతం 12కుపైగా నమోదు కావడంపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. ఈ విషయంలో జిల్లా రెడ్ జోన్‌లో ఉన్నట్లు స్పష్టమైందని పేర్కొన్నారు. గత ఏడాది జిల్లాలో 1,500 మందికి పైగా టీనేజర్లు గర్భం దాల్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనిపై అవగాహన పెంచి, బాల్య వివాహాలను అరికట్టాలని సీఎం ఆదేశించారు.

News February 10, 2026

సూర్య అద్భుతమైన కెప్టెన్: గంభీర్

image

భారత T20 కెప్టెన్ సూర్యకుమార్‌పై కోచ్ గంభీర్ ప్రశంసలు కురిపించారు. ‘అతడు అద్భుతమైన నాయకుడు. బ్యాటర్‌గా ఓ వైపు అదరగొడుతూనే తోటి ఆటగాళ్లతో మంచి సంబంధాలను పెంచుకున్నాడు. జట్టు వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతున్నాడు. దీంతో కోచ్‌గా నాకు ఈజీ అవుతోంది. అలాంటి వ్యక్తి టీమ్ ఇండియాను నడిపించడం గొప్ప విషయం. సూర్య ఒత్తిడిలోనూ సరైన నిర్ణయాలు తీసుకుంటాడు’ అని కొనియాడారు. USAతో మ్యాచ్‌లో సూర్య చెలరేగడం తెలిసిందే.