News February 28, 2025
ములుగు జిల్లావ్యాప్తంగా పోలైన ఓట్లు

ములుగు జిల్లా వ్యాప్తంగా 9మండలాల్లో ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా పోలైన ఓట్ల వివరాలు.. ములుగు మండలంలో 193 ఓట్లకు 180, వెంకటాపూర్ 40కి 35, గోవిందరావుపేటలోకి 108కి 102, తాడువాయి 65కి 58 ఓట్లు పోలయ్యాయి. ఇదిలా ఉండగా ఏటూరునాగారంలో 46కి 44, కన్నాయిగూడెం 19కి 18, మంగపేట 95కి 88, వాజేడులో 33కి 31, వెంకటాపురం 29కి 27 ఓట్లు నమోదు అయినట్లు అధికారులు చెప్పారు.
Similar News
News February 28, 2025
ATP: రూ.2.95కోట్ల విలువైన ఫోన్లు రికవరీ

అనంతపురంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం మొబైల్ ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు. ఈ మేళాలో జిల్లా ఎస్పీ జగదీశ్ రూ.2.95కోట్ల విలువ చేసే 1,183 ఫోన్లను బాధితులకి అందజేశారు. సాంకేతికత వినియోగించి ఫోన్లను రికవరీ చేశామని ఎస్పీ చెప్పారు. ఇప్పటి వరకు జిల్లా పోలీసు శాఖ 11,378 పోన్లు రికవరీ చేసిందని తెలిపారు. వాటి విలువ సుమారు రూ.21.08 కోట్లు ఉంటుందని వెల్లడించారు.
News February 28, 2025
కొండగట్టులో పలు వ్యాపారాలకు టెండర్

జిల్లాలోని ప్రముఖ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఇవాళ పలు వ్యాపారాలకు అధికారులు ఈ, సిల్డ్ టెండర్, బహిరంగ వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరికాయలు అమ్ముకునే హక్కుకు రూ. 1,50,00,000, పుట్నాలు, పేలాలు అమ్ముకునే హక్కుకు రూ. 27,70,000, పూలు, పండ్లు అమ్ముకునే హక్కుకు రూ.40,00,000, గాజులు ప్లాస్టిక్ ఆట వస్తువులు అమ్ముకునే హక్కు రూ.32,00,000 లతో హెచ్చు పాటాదారులు దక్కించుకున్నారు.
News February 28, 2025
చీపురుపల్లి జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు ఇవే..!

➤ మార్చి 2న ఉదయం నేత్రోత్సవం, పాలధార ఉత్సవం, సాయంత్రం భామా కలాపం పేరిట భాగవతం ప్రదర్శన
➤ మార్చి 2న రాత్రి 7గంటలకు రాష్ట్ర స్థాయి డాన్స్ పోటీలు
➤ 3న సాయంత్రం క్లాసికల్ డాన్స్ ప్రోగ్రాం, ప్రముఖ సినీ గాయకులచే స్వరాభిషేకం, బాలు రైడర్స్ ఆధ్వర్యంలో డాన్స్ ఈవెంట్
➤ 4న రాత్రి ఢీ డ్యాన్సర్లతో మెగా డాన్స్ హంగామా, 11 గంటలకు భారీ మందుగుండు ప్రదర్శన, శ్రీరామాంజనేయ యుద్ధం, సత్యహరిశ్చంద్ర నాటకం