News April 23, 2025
ములుగు జిల్లా ఎంపీసీ TOPPERS వీరే

మంగళవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. ఫస్ట్ ఇయర్లో చైత్ర(ప్రభుత్వJr కళాశాల ఏటూరునాగారం)-465, బి.క్రాంతి కుమార్(టీజీ ఆర్ఎస్ బండారుపల్లి) 464, కే.సాయి లహరి(కేజీబీవీ మంగపేట)464, టాపర్లుగా నిలిచారు. పి.చరణ్ తేజ(టీజీఆర్ఎస్ బండారుపల్లి) 993, ఎండీ అస్మి (ప్రభుత్వ జూనియర్ కళాశాల మంగపేట) 984 మార్కులతో టాపర్లుగా నిలిచారు.
Similar News
News April 23, 2025
సెల్యూట్: ఉగ్రవాదులతో పోరాడి.. వీర మరణం

పహల్‌గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారిలో సయ్యద్ అదిల్ హుస్సేన్ షా ఒక్కడే స్థానికుడు. గుర్రంపై పర్యాటకులను ఎక్కించుకుని పహల్‌గామ్ తీసుకెళ్తూ ఉంటాడు. అందరూ ప్రాణ భయంతో పరుగులు పెడుతుంటే.. హుస్సేన్ మాత్రం ప్రాణాలను లెక్కచేయకుండా ఎదురు తిరిగాడు. ఓ ఉగ్రవాది నుంచి రైఫిల్ లాక్కునేందుకు ప్రయత్నించగా కాల్చి చంపేశారు. తమ బిడ్డ మరణానికి దేశం ప్రతీకారం తీర్చుకోవాలని అతడి పేరెంట్స్ కోరుతున్నారు.
News April 23, 2025
KMR: వేసవి సెలవులు.. ఇంటి బాట పట్టిన విద్యార్థులు

పాఠశాలలు ముగియడం.. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో విద్యార్థుల్లో సందడి నెలకొంది. వారి ఆనందానికి అవధుల్లేవు. చదువుల ఒత్తిడికి కాస్త విరామం దొరకడంతో సొంతూళ్లకు చేరుకుంటున్న విద్యార్థులతో పిట్లంలో సందడి వాతావరణం నెలకొంది. దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న తమ పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులతో బస్టాండ్ కిక్కిరిసిపోయింది.
News April 23, 2025
సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం లెక్కింపు

సింహాద్రి అప్పన్నకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు 28 రోజులకు గాను ఆలయ అధికారులు ఈవో సుబ్బారావు పర్యవేక్షణలో బుధవారం లెక్కించారు. మొత్తం రూ.1,81,41,219 ఆదాయం వచ్చింది. బంగారం 145.100 గ్రాములు, వెండి 11.250 కిలోలు, 8 దేశాల విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, సేవా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.