News February 26, 2025

ములుగు జిల్లా కలెక్టర్ సూచన 

image

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. ఈనెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జిల్లాలోని 9 పోలింగ్ కేంద్రాలకు సరిపడా సిబ్బందిని నియమించడంతో పాటు మరో 20 శాతం అదనపు సిబ్బందిని రిజర్వులో ఉంచామన్నారు. జిల్లాలో 628 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారని వివరించారు.

Similar News

News November 23, 2025

జీపీవోల సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్‌గా శ్రీనివాస్

image

గ్రామ పాలనాధికారుల(జీపీవో) సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్‌గా జనగామకు చెందిన పెండెల శ్రీనివాస్ నియమితులయ్యారు. తనపై నమ్మకంతో ఉమ్మడి జిల్లా బాధ్యతలు అప్పగించిన ఆ సంఘం రాష్ట్ర నాయకత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు. జీపీవోల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.

News November 23, 2025

సాయి సేవా స్ఫూర్తితోనే అభివృద్ధి: సీఎం చంద్రబాబు

image

మన ముందు నడయాడిన దైవం శ్రీ సత్యసాయిబాబా శత జయంతి సందర్భంగా ఆయన చూపిన సేవా మార్గాన్ని స్మరించుకుందామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విద్య, వైద్యం, తాగునీరు వంటి సేవలతో ‘మానవ సేవే మాధవ సేవ’ అని బాబా నిరూపించారని తెలిపారు. సత్యసాయి సిద్ధాంతం ద్వారా ప్రపంచానికి జ్ఞానం, సన్మార్గం లభించాయని, ఆయన స్ఫూర్తితోనే రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని సీఎం దివ్యాంజలి ఘటించారు.

News November 23, 2025

కొత్తగూడెం: దుప్పి మాంసం కేసు.. రిమాండ్

image

అశ్వాపురం మండలం మిట్టగూడెంలో దుప్పిని వేటాడి మాంసం విక్రయించిన కేసులో ఇద్దరు నిందితులకు కొత్తగూడెం జిల్లా కోర్టు మేజిస్ట్రేట్ శనివారం 14 రోజుల రిమాండ్ విధించారు. మిట్టగూడేనికి చెందిన సప్కా వీరస్వామి, కనితి కన్నయ్యలను శుక్రవారం రాత్రి దుప్పి మాంసంతో సహా అటవీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని జిల్లా కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ ఉత్తర్వులు జారీ చేశారు.