News January 28, 2025

ములుగు జిల్లా రైతు భరోసా DETAILS

image

ములుగు జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా పథకానికి 86,338 మంది రైతులు అర్హత కలిగి ఉండగా, వీరికి సంబంధించిన 1,77,631 ఎకరాలకు రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. ఇందుకు సంబంధించి రూ.106.57 కోట్ల నిధులలో సోమవారం రైతుల ఖాతాలలో రూ.8.26 కోట్లు జమ అయ్యాయని అధికారులు వెల్లడించారు. మిగతా రైతులకు విడతల వారీగా వారి ఖాతాలలో మార్చి 31వ తేదీ లోపు నిధులు జమ అవుతాయని ప్రభుత్వం ప్రకటించిన విషయం విధితమే.

Similar News

News November 18, 2025

ఉమ్మడిగా తనిఖీ చేసి ధర నిర్ణయించాలి: అల్లూరి కలెక్టర్

image

డీ.గొందూరు, కొంతలి, పాడేరు బైపాస్ జాతీయ రహదారికి కేటాయించిన భూములు అటవీ, ఉద్యానవనశాఖ, రెవెన్యూ శాఖ కలిసి క్షేత్రస్థాయిలో ఉమ్మడి తనిఖీ చేసి ధర నిర్ణయించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో వీసీ నిర్వహించారు. జాతీయ రహదారి నిర్మాణంలో, జాతీయ పరిహారం చెల్లింపులలో లక్ష్యాలను నిర్దేశించుకుని, ఆ దిశగా భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లింపులు చేయాలన్నారు.

News November 18, 2025

ADB: ఫిర్యాదులు విన్న వెంటనే పరిష్కారానికి ఆదేశం: ఎస్పీ

image

ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం పోలీస్ ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 23 మంది ఫిర్యాదుదారుల సమస్యలను ఆయన విన్నారు. ఎస్పీ వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. సుదూర ప్రాంతాల ప్రజలు 8712659973 నంబర్‌కు వాట్సాప్‌తో సమస్యలు తెలపాలని, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.

News November 18, 2025

ASF: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లతో కలిసి ఆయన అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అందిన ప్రతి దరఖాస్తును పరిశీలించి, త్వరగా పరిష్కరించాలని ఆయన సూచించారు.