News February 17, 2025
ములుగు జిల్లా సైన్స్ అధికారిని సస్పెండ్ చేయాలి: రవితేజ

ములుగు జిల్లా సైన్స్ అధికారి జయదేవ్ అక్రమాలపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ డిమాండ్ చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన ఎస్ఎఫ్ఐ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డీఈవో ఆఫీసులో అక్రమంగా డిప్యూటేషన్పై ఉంటూ, తోటి ఉపాధ్యాయుల దగ్గర లంచాలు తీసుకుంటూ, తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠాలు బోధించకుండా నిత్యం డీఈఓ ఆఫీసులోనే ఉండడంపై విచారణ జరిపించాలని రవితేజ డిమాండ్ చేశారు.
Similar News
News November 19, 2025
ఖమ్మం: చిరుత సంచారం.. రైతుల భయాందోళన

ముదిగొండ మండలం గంధసిరి గ్రామం నక్కల వాగు, బైండ్ బండ ఏరియాలో మంగళవారం సాయంత్రం చిరుత పులి సంచారం కలకలం సృష్టించింది. పులిని చూశామని స్థానిక వ్యవసాయదారులు దారగాని రమణమ్మ, దారగాని తిరుపయ్య చెప్పగా, రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు బుధవారం ఉదయం గ్రామానికి చేరుకుని, చిరుత సంచరించిన ప్రదేశాలలో పాదముద్రలను పరిశీలిస్తున్నారు.
News November 19, 2025
తోట్లవల్లూరు: మినుముల యంత్రంలో పడి మహిళ మృతి

తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెంకు చెందిన మహిళ కూలి పనికి వెళ్లి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. షేక్ కాసింబి(40) మినుములు నూర్చడానికి గుంటూరు (D) కొల్లిపర (M) వల్లభారానికి వెళ్లింది. ప్రమాదవశాత్తు మినుము నూర్పిడి యంత్రంలో చీర ఇరుక్కుని చేతులు, మెడకు తీవ్ర గాయాలై చనిపోయినట్లు ఎస్సై పి. కోటేశ్వరరావు తెలిపారు. ఆమె భర్త ఇస్మాయిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసామన్నారు.
News November 19, 2025
362 పోస్టులకు నోటిఫికేషన్

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 362 MTSపోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హత గల అభ్యర్థులు ఈనెల 22 నుంచి DEC 14వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 -25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. టైర్ 1, టైర్ 2 రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.mha.gov.in/ *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.


