News March 22, 2025
ములుగు: డబ్బులు కాజేసిన రేంజర్పై కేసు నమోదు

ములుగు జిల్లాలో సంచలనంగా మారిన అటవీ శాఖ రేంజర్ బాలరాజు వ్యవహారంలో పోలీసులు స్పందించారు. సదరు రేంజర్పై ఏటూరునాగారంలో కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. ఏడుగురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఖాతాల్లో రూ.2.70 డబ్బులు వేయించి, డ్రా చూపించి తీసుకున్న రేంజర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు.
Similar News
News January 8, 2026
మిరపలో నల్ల తామర పురుగుల నివారణ ఎలా?

మిరపలో నల్ల తామర పురుగుల తీవ్రతను బట్టి ఎకరానికి 25కు పైగా నీలి రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే బవేరియా బస్సియానా 5 గ్రాములు లేదా స్పైనటోరం 0.9ml మందును లేదా ఫిప్రోనిల్ 5% ఎస్.సి 2ML లేదా స్పైనోసాడ్ 45% ఎస్.సి 0.3MLలలో ఏదో ఒకదానిని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగు ఉద్ధృతిని బట్టి ఈ మందులను మార్చిమార్చి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News January 8, 2026
13 మంది ప్రాణాలు తీసిన ఏనుగు

ఝార్ఖండ్లోని వెస్ట్ సింగ్భూమ్ జిల్లాలో ఓ ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. 2 రోజుల్లోనే 13 మందిని చంపేయగా, మరో నలుగురు గాయపడ్డారని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ‘5వ తేదీన కోల్హాన్లో ఏనుగు దాడిలో ఏడుగురు, 6న నోవాముండి, హటగమారియలో ఆరుగురు మృత్యువాతపడ్డారు’ అని చెప్పారు. ఆ గజరాజును అడవిలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా అక్కడ గత DEC 16 నుంచి ఏనుగుల దాడిలో 22 మంది ప్రాణాలు వదిలారు.
News January 8, 2026
‘కాకినాడ’కు ఆ పేరు ఎలా వచ్చిందో.. మీకు తెలుసా..?

చారిత్రక నగరమైన కాకినాడ పేరు వెనుక అనేక ఆసక్తికర కథనాలు ఉన్నాయి. బ్రిటీష్, ఫ్రెంచ్ కాలంలో తొలుత ‘కోకెనడా’గా, కాలక్రమేణా ‘కోకనందవాడ’, ‘కాకివాడ’, ‘కోకనాడ’గా రకరకాలుగా పిలిచేవారు. విదేశీయులు, క్రైస్తవ మత ప్రచారకులు పెట్టిన పేర్లు ఎన్ని ఉన్నా, చివరికి వాడుక భాషలో స్థిరపడి ‘కాకినాడ’గా రూపాంతరం చెందింది. నేడు జిల్లా కేంద్రంగా విరాజిల్లుతున్న ఈనగరం పేరుపై ఇప్పటికీ ఆసక్తికర చర్చలు జరుగుతుంటాయి.


