News February 4, 2025

ములుగు: తుడందెబ్బ మొదటి మహిళా అధ్యక్షురాలి మృతి

image

తుడుందెబ్బ మొదటి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కండేల మల్లక్క మంగళవారం మృతి చెందారు. ఎన్నో ఏళ్లుగా ఆదివాసీ అస్తిత్వం కోసం పోరాటం చేసి, ఆదివాసులకు హక్కులు కల్పించడంలో ఆమె ఎంతో కృషి చేశారని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి అన్నారు. మల్లక్క మృతి ఆదివాసీ సమాజానికి తీరని లోటన్నారు. ఆంధ్ర వలసదారులపై పోరాటం చేసి వెయ్యి ఎకరాల భూమిని ప్రజలకు పంచిదన్నారు.

Similar News

News February 24, 2026

వరంగల్ జిల్లాలో పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

జిల్లాలో నిర్వహించబోయే ఇంటర్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న కలెక్టర్ పరీక్షా ఏర్పాట్ల వివరాలను తెలిపారు.

News February 24, 2026

సిరిసిల్ల: ఫిబ్రవరి, మార్చిలో సదరం క్యాంపులు

image

​రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో సదరం క్యాంపులు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 26న కంటిచూపు, మార్చి 5న వినికిడి, 10న మానసిక, 12, 13, 16న ఆర్థో పరీక్షలు ఉంటాయి. దివ్యాంగులు ఆధార్, ఫోటోలు, మెడికల్ రిపోర్ట్స్ తో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు.

News February 24, 2026

ఎంజీయూ డిగ్రీ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల

image

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ విద్యార్థుల పరీక్షా ఫీజు షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించారు. 2022-2026 బ్యాచ్‌ల సెమిస్టర్ 1 నుంచి 6 వరకు రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలకు ఫీజు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. అపరాధ రుసుము లేకుండా మార్చి 16 వరకు, రూ.100 జరిమానాతో మార్చి 18 వరకు గడువు ఉందని సీఓఈ డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.