News January 22, 2025
ములుగు: దివ్యాంగులు, వయోవృద్ధులు దరఖాస్తు చేసుకోండి

ములుగు జిల్లాలో దివ్యాంగులు, వయోవృద్ధులు పునరావాస పథకం కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి శిరీష తెలిపారు.వ్యవసాయ, పరిశ్రమలు, సేవ, వ్యాపారాలను స్థాపించుకొని జీవనోపాధి పొందాలన్నారు. ఈ పథకం ద్వారా బ్యాంకు లింకేజీ లేకుండా రూ.50 వేలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు. జిల్లాకు ఎనిమిది యూనిట్ల ద్వారా రూ.4 లక్షల సబ్సిడీ మంజూరైందన్నారు. www.tsobmms.cgg.gov.inలో నమోదు చేయాలన్నారు.
Similar News
News November 23, 2025
న్యూస్ అప్డేట్స్

⋆ నేడు పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు.. పాల్గొననున్న AP CM చంద్రబాబు, తెలంగాణ CM రేవంత్
⋆ నేడు రాప్తాడుకు YCP అధినేత జగన్.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరు
⋆ HYDలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు.. సీతాఫల్మండి నుంచి చిలకలగూడ వరకు యూనిటీ మార్చ్లో పాల్గొననున్న కిషన్ రెడ్డి. రాంచందర్ రావు
News November 23, 2025
జీఎన్ఎం శిక్షణ దరఖాస్తు గడువు పొడిగింపు

నల్గొండ జిల్లాలోని ప్రైవేట్ జీఎన్ఎం (జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైపరీ) శిక్షణ సంస్థల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 3 సంవత్సరాల శిక్షణకు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. ఆసక్తి గల వారు పూర్తి వివరాలు ఆన్లైన్ వెబ్ సైట్ dme.tealngana.gov.inలో చూసుకోవచ్చని సూచించారు.
News November 23, 2025
NZB: ఒకే రోజు భార్యాభర్తలు మృతి

జీవితాంతం కలిసి బతికిన భార్యాభర్తలు చావును కూడా పంచుకున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కుల్సాపూర్ తండాకు చెందిన లకావత్ మురుభాయి(90) శనివారం ఉదయం 3 గంటలకు చనిపోయింది. అనారోగ్యంతో ఉన్న ఆమె భర్త తావుర్య ఆమె చావును తట్టుకోలేక నిన్న సాయంత్రం 7గంటలకు మృతిచెందాడు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకేరోజు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.


