News March 15, 2025

ములుగు: నేటీ నుంచి అంగన్వాడీలకు ఒంటిపూట

image

రాష్ట్రంలో ఎండలు మండుతున్న వేల అంగన్వాడీ కేంద్రాలలో ఒంటిపూట బడులు నిర్వహించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల తరహాలోనే శనివారం నుంచి అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు నడపాలని మంత్రి సూచించారు.

Similar News

News October 25, 2025

జనగామ: చర్చలు సఫలం.. చదువులు పదిలం!

image

బెస్ట్ అవైలబుల్ పథకం కింద చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేపట్టిన ఆందోళనలకు ఎట్టకేలకు తెరపడింది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క యాజమాన్యాలతో చర్చించి బోధనకు ఇబ్బందులకు లేకుండా చూడాలని ఆదేశించారు. దీంతో సంబంధిత శాఖ అధికారులు జనగామ జిల్లాలోని 5 బెస్ట్ అవైలబుల్ పాఠశాల యాజమాన్యాలతో మాట్లాడి చదువులు సాగేలా కృషి చేశారు.

News October 25, 2025

జనగామ: పెండింగ్‌లో రూ.50లక్షల స్కాలర్షిప్స్!

image

జనగామ జిల్లాలోని ఎస్సీ సంక్షేమ శాఖకు సంబధించిన స్కాలర్ షిప్స్ కేవలం రూ.50లక్షలు మాత్రమే పెండింగ్ ఉన్నాయని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన రూ.50లక్షలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, 2024-25, 2025-26 విద్యా సంవత్సరాల స్కాలర్ షిప్స్ పెండింగ్ లేవని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి రాగానే విద్యార్థుల ఖాతాలో జమ చేస్తున్నట్లు వెల్లడించారు.

News October 25, 2025

జనగామ: కేంద్రాలు కరవాయే.. దళారులదే రాజ్యమాయే!

image

ఆరుగాలం శ్రమించిన మొక్కజొన్న రైతు నష్టాల పాలవుతున్నారు. సకాలంలో పంట చేతికొచ్చినా అకాల వర్షాలతో కల్లాల్లో తడిసి ముద్దవుతున్నాయి. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ నేటికీ ఏర్పాటు చేయకపోవడంతో రైతన్నలు దళారులను ఆశ్రయిస్తున్నారు. అకాల వర్షాల కారణంగా రూ.1600 నుంచి రూ.1800లకే దళారులకు విక్రయిస్తూ జనగామ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.