News March 15, 2025
ములుగు: నేటీ నుంచి అంగన్వాడీలకు ఒంటిపూట

రాష్ట్రంలో ఎండలు మండుతున్న వేల అంగన్వాడీ కేంద్రాలలో ఒంటిపూట బడులు నిర్వహించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల తరహాలోనే శనివారం నుంచి అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు నడపాలని మంత్రి సూచించారు.
Similar News
News April 11, 2026
నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు ఉదయం 11 గంటలకు రానున్నారు. ముందుగా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొని, అనంతరం అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం కానున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ రాష్ట్ర కమిటీపై సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News April 11, 2026
ములుగు: ‘మన ఇసుక వాహనం’తో అక్రమ రవాణాకు చెక్!

జిల్లాలో ప్రవేశపెట్టిన ‘మన ఇసుక వాహనం’తో అక్రమ ఇసుక రవాణాకు చెక్ పడనుంది. కొందరు వ్యక్తులు ఇష్టానుసారంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంపు చేసి పట్టణాలకు తరలిస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ ప్రత్యేక చొరవతో ‘ఇసుక వాహనం’ అమల్లోకి తెచ్చారు. మీ సేవలో అవసరమున్న వ్యక్తులు స్లాట్ బుక్ చేసుకొని ఇసుక పొందాల్సి ఉంటుంది. ప్రతి వినియోగదారుడి వివరాలు స్థానిక కార్యదర్శి పరిశీలించి సప్లై చేస్తారు.
News April 11, 2026
GNT: ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు నందిగం సురేశ్

కాకినాడకు సంబంధించిన ఓ చర్చి ట్రస్ట్ రెన్యూవల్ కోసం మాజీ MP నందిగం సురేశ్ ఓ వ్యక్తి నుంచి రూ. 25 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ విజయవాడకు చెందిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సురేశ్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి ఈ నెల 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు.


