News February 15, 2025
ములుగు: నేడు డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు

2008 డీఎస్సీలో అర్హత సాధించిన ఎస్జీటీ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వారిని కాంట్రాక్ట్ టీచర్లుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు HNK డీఈవో కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేశారు.ఉమ్మడి జిల్లాలో 295 మంది అభ్యర్థులకు గాను 182 మంది అభ్యర్థులు వెరిఫికేషన్కు హాజరయ్యారు.నేడు ములుగు జిల్లాకు చెందిన 28 మందికి నియామకపత్రాలు అందజేయనున్నారు. వీరికి నెలకు రూ.31,040 జీతం ఇవ్వనున్నారు.
Similar News
News November 27, 2025
జగిత్యాల జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఎన్నంటే..?

జగిత్యాల జిల్లాలో మొత్తం 385 గ్రామ పంచాయతీలు, 3536 వార్డులు ఉండగా, ఇందుకోసం 3536 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ముఖ్యంగా 75 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను అధికారులు గుర్తించి, అందుకు తగిన భద్రత చర్యలు చేపట్టారు. ఇందులో 1వ విడతలో 122 పంచాయతీలకు 1172 పోలింగ్ కేంద్రాలు, 2వ విడతలో 144 పంచాయతీలకు1276 పోలింగ్ కేంద్రాలు, 3వ విడతలో 119 పంచాయతీలకు 1088 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
News November 27, 2025
తిరుమల: సుబ్రహ్మణ్యానికి 10 వరకు రిమాండ్..!

తిరుమల కల్తీ నెయ్యి కేసులో అరెస్టయిన టీటీడీ ప్రొక్యూర్ మెంట్ జీఎం సుబ్రహ్మణ్యంకు నెల్లూరు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. గురువారం సాయంత్రం ఆయన్ను కోర్టులో హాజరుపరచగా, డిసెంబర్ 10వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో సుబ్రహ్మణ్యంను నెల్లూరు కోర్టు నుంచి జైలుకు తరలించారు. ఈ కేసుపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది.
News November 27, 2025
కరీంనగర్లో తొలి రోజు 92 సర్పంచ్ నామినేషన్లు

కరీంనగర్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి రోజు 92 సర్పంచ్ నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. గంగాధరలో అత్యధికంగా 28 నామినేషన్లు దాఖలయ్యాయి. చొప్పదండిలో 15, కొత్తపల్లిలో 12, కరీంనగర్ రూరల్లో 10, రామడుగులో 27 నామినేషన్లు నమోదయ్యాయి. 866 వార్డులకు గాను, తొలి రోజు 86 వార్డు సభ్యుల నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వివరించారు.


