News January 31, 2025
ములుగు: పదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి స్నాక్స్

ప్రభుత్వ స్కూళ్లలో పదో తరగతి చదివే విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు ఈవెనింగ్ స్నాక్స్ అమలు చేయనుంది. ఇందుకు ఒక్కో విద్యార్థి కోసం రూ.15 చొప్పున ఖర్చు చేయనుంది. పల్లీపట్టి, బిస్కెట్లు, పకోడీ తదితరాలను అందించనున్నారు. జిల్లాలోని 1,076 మంది విద్యార్థులను గాను రూ.6,13,320 నిధులు మంజూరయ్యాయి. వీటిని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఖాతాల్లో జమ చేయనున్నారు.
Similar News
News February 23, 2026
తూ.గో: 58 కేంద్రాలు @ 43,108 మంది విద్యార్థులు

రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని 58 కేంద్రాల్లో 43,108 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగనుండగా, అరగంట ముందు వెళ్లే నిబంధనను రద్దు చేశారు. కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత, నిఘా ఏర్పాటు చేశారు.
News February 23, 2026
YELLOW ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో APలోని కోస్తా, రాయలసీమల్లో ఇవాళ వానలు కురుస్తాయని IMD తెలిపింది. TGలోని భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సిద్దిపేట, మెదక్ సహా <<19211980>>17 జిల్లాలకు<<>> ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా నిన్న APలోని పోలవరం, రాజవొమ్మంగి, అనకాపల్లిలో భారీ వర్షం కురిసింది. మరోవైపు కర్నూలులో దేశంలోనే అత్యధికంగా 37డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. TGలోని ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డిలో వాన కురిసింది.
News February 23, 2026
భద్రాద్రి: అడవిలో పులి సంచారం.. యంత్రాంగంలో అస్పష్టత

కిన్నెరసాని అటవీ ప్రాంతంలో తల్లి,పిల్ల పులుల పాదముద్రలను అధికారులు గుర్తించినప్పటికీ, అవి ఎటు వెళ్లాయనే అంశంపై స్పష్టత కరవైంది. పులి కొమరారం వైపు వెళ్లిందని స్థానికులు,ఏటూరునాగారం అడవుల్లోకి వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా ప్రకటనలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని, త్వరలోనే పులి జాడ గుర్తిస్తామని అటవీ అధికారి బాబు తెలిపారు.


