News January 31, 2025
ములుగు: పదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి స్నాక్స్

ప్రభుత్వ స్కూళ్లలో పదో తరగతి చదివే విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు ఈవెనింగ్ స్నాక్స్ అమలు చేయనుంది. ఇందుకు ఒక్కో విద్యార్థి కోసం రూ.15 చొప్పున ఖర్చు చేయనుంది. పల్లీపట్టి, బిస్కెట్లు, పకోడీ తదితరాలను అందించనున్నారు. జిల్లాలోని 1,076 మంది విద్యార్థులను గాను రూ.6,13,320 నిధులు మంజూరయ్యాయి. వీటిని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ఖాతాల్లో జమ చేయనున్నారు.
Similar News
News February 10, 2025
చైనా సంక్షోభం: పెళ్లిళ్లు తగ్గి విడాకులు పెరుగుతున్నాయ్

చైనాలో పెళ్లిళ్లు తగ్గి విడాకులు పెరగడం ఆందోళనకరంగా మారింది. 2024లో 61L వివాహాలు నమోదయ్యాయి. 1986 తర్వాత ఇదే అత్యల్పం. 2023తో పోలిస్తే 20.5% తగ్గడం గమనార్హం. ఇక గత ఏడాది 26L జంటలు డివోర్స్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. 2023తో పోలిస్తే ఈ సంఖ్య 28K అధికం. అలాగే ఆ దేశంలో శ్రామిక జనాభా(16-59yrs) 68L తగ్గిందని ఓ నివేదికలో వెల్లడైంది. మొత్తం జనాభాలో 60ఏళ్లకు పైగా వయసున్న వారు 22 శాతానికి పెరిగారని తేలింది.
News February 10, 2025
కందుకూరు: ఉచితంగా రూ.45 వేల ఇంజెక్షన్

గుండెపోటు వచ్చినప్పుడు వేసే అత్యంత విలువైన టెనెక్టెప్లస్ ఇంజెక్షన్ కందుకూరు ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులో ఉందని డా. తులసిరామ్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిన ఒక గంట లోపు టెనెక్టెప్లస్ ఇంజెక్షన్ ఇవ్వగలిగితే రోగి ప్రాణాన్ని కాపాడవచ్చన్నారు. దీని ఖరీదు రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకూ ఉంటుందని, కానీ ప్రభుత్వం దీన్ని ఉచితంగా అందిస్తుందని తెలిపారు.
News February 10, 2025
బాలల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి: కలెక్టర్

పిల్లల రక్షణ, సంరక్షణ ప్రతి ఒక్కరిపై ఉందని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సోమవారం కలెక్టర్ డీకే బాలాజీ, సీనియర్ సివిల్ జడ్జి కేవీ రామకృష్ణయ్య అధ్యక్షతన డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. బాలల రక్షణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు.