News March 21, 2025
ములుగు: పని పట్ల మంత్రి సీతక్క నిబద్ధత

ఎంతో పని ఒత్తిడి అసెంబ్లీ సమావేశాలున్నా శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నరకే ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయానికి మంత్రి సీతక్క చేరుకున్నారు. ఉదయం 9.45వరకు అధికారులతో జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్, తాగు నీటి పంపిణిపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం శాసన మండలికి చేరుకుని బడ్జెటపై జరిగిన చర్చలో మంత్రి సీతక్క పాల్గొన్నారు.
Similar News
News April 2, 2025
రూ.266 కోట్లతో అభివృద్ధి పనులు: అన్నమయ్య కలెక్టర్

ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం పంచ ప్రాధాన్యాల లక్ష్యాన్ని నిర్దేశించిందని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. కలెక్టరేట్లో ఆయన మాట్లాడారు. 2025-26 మొదటి త్రైమాసికానికి రూ.266కోట్ల లక్ష్యంతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు చెప్పారు. రూ.43కోట్ల అంచనాతో 10వేల ఎకరాల్లో పశుగ్రాసం పెంపకం, రూ.100 కోట్లతో సీసీ రోడ్లు, మినీ గోకులాల నిర్మిస్తామన్నారు.
News April 2, 2025
నల్గొండ: ‘డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు’

ప్రజా పంపిణీ వ్యవస్థలో డీలర్లు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. మంగళవారం నల్గొండలోని పలు రేషన్ దుకాణాలు, రైస్ మిల్లులను ఆయన తనిఖీ చేశారు. సన్న బియ్యం పంపిణీలో అవకతవకలు జరిగితే డీలర్షిప్ రద్దు చేస్తామన్నారు. డీలర్లు నియమ నిబంధనలు పాటించడం లేదని ఫిర్యాదులు ఉన్నాయన్నారు.
News April 2, 2025
ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: ASF SP

యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, నిషేధిత ప్లే కార్డ్స్, గేమింగ్ యాప్‌లకు, IPL బెట్టింగ్ లకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తక్కువ సమయంలో సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న భ్రమలో యాప్‌లకు బానిసలవుతున్నట్లు చెప్పారు. యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్‌కు ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు.