News March 26, 2025

ములుగు: పిల్లల పాలిట శాపంగా ‘బోనోఫిక్స్’ మత్తు!

image

ములుగు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బోనోఫిక్స్ మత్తు పిల్లల పాలిట శాపంగా మారుతోంది. గంజాయి, డ్రగ్స్, మద్యపానం వంటి మత్తు పదార్థాల గురించి వింటూనే ఉంటాం. కానీ విద్యార్థులు, పిల్లలు బోనోఫిక్స్ అనే మత్తు పదార్థానికి అలవాటు పడుతున్నారు. పోలీసులు నిఘాతో దాడులు చేస్తున్న బోనోఫిక్స్ అమ్మకాలు ఆగడం లేదు. కొందరు షాపుల నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా బోనోఫిక్స్ అమ్ముతూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు.

Similar News

News April 21, 2025

సీఎంఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలి: నిర్మల్ కలెక్టర్

image

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం భైంసా ఆర్డీవో కార్యాలయంలో ఆమె రైస్ మిల్లర్లతో సమావేశమయ్యారు. గతంలో మిల్లర్లు ప్రాసెసింగ్‌కు తీసుకున్న ధాన్యానికి సంబంధించి బకాయిలు ఇంకా చెల్లించకపోవడాన్ని గుర్తుచేశారు. రైస్ మిల్లర్ల వారీగా పెండింగ్ బకాయిలను త్వరగా చెల్లించాలన్నారు.

News April 21, 2025

ప్రపంచంలో అతిపెద్ద పెట్రోల్ బంక్ ఇదే!

image

మన దగ్గర ఉండే పెట్రోల్ బంకుల్లో మహా అంటే 10 వరకు ఫిల్లింగ్ స్పాట్స్ ఉంటాయి. కానీ, ఒకేసారి 120 కార్లకు పెట్రోల్ ఫిల్ చేయగలిగే సామర్థ్యంతో బంక్ ఉందనే విషయం మీకు తెలుసా? అమెరికా టెక్సాస్‌లోని ఆస్టిన్‌కు సమీపంలో ‘Buc-ee’s’ అనే బంక్ ఉంది. ఇది 75,000 చదరపు అడుగులకు పైగా విస్తరించి ఉండగా ఇందులో ఫుడ్ & షాపింగ్ కోసం స్టాల్స్ ఏర్పాటు చేశారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పర్యాటక ప్రాంతంగా మారిపోయింది.

News April 21, 2025

కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర: సీఐటీయూ

image

కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాల సవరణ ద్వారా కార్మికులను యజమానులకు పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చే కుట్ర జరుగుతుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయలక్ష్మి ఆరోపించారు. మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు చెంపపెట్టు కావాలని అన్నారు. సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలోని వాల్మీకి కమ్యూనిటీ హాల్లో సన్నాహక సదస్సుకు పాల్గొని మాట్లాడారు.

error: Content is protected !!