News March 23, 2024

ములుగు: పురుగు మందుతాగి వ్యక్తి ఆత్మహత్య

image

ములుగు మండల కేంద్రానికి చెందిన తోడేటి అశోక్ (32) పురుగు మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం రోజు పొలం వద్దకు వెళ్లిన అశోక్ పురుగు మందు తాగాడు. గుర్తించిన కుటుంబీకులు లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న అశోక్ మృతిచెందాడు. భార్య భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News November 11, 2024

BREAKING: కోళ్ల ఫాం గోడ కూలి ఇద్దరు మృతి

image

మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. చిన్న శంకరంపేట మండలంలో గోడకూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. స్థానికుల వివరాలు.. కామారం తండాలో కోళ్ల ఫాం నిర్మిస్తుండగా అకస్మాత్తుగా గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతులు ఝార్ఖండ్‌కు చెందిన రఖీవాల, అసిక్కుల్ షేక్‌గా గుర్తించారు. మృతదేహాలను రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

News November 11, 2024

కస్తూర్బా విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: హరీశ్‌ రావు

image

బోధన, భోజనం కోసం విద్యార్థులు ఆందోళన చేస్తుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై హరీశ్ రావు ఫైర్‌ అయ్యారు. బోధన లేదు, భోజనం లేదంటూ బీబీపేట కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులలో కలిసి చేసిన ఆందోళనపై ఎక్స్‌ వేదికగా స్పందించారు. నాణ్యమైన భోజనం, మౌలిక వసతుల కల్పన కోసం విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుండటం శోచనీయం అన్నారు.

News November 11, 2024

మెదక్: మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు నివాళులు

image

స్వాతంత్ర సమరయోధులు, తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని మెదక్ సమీకృత కలెక్టరేట్లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ఎల్లయ్య, శ్రీనివాసరావు, మాధవి, నాగరాజు గౌడ్ తదితరులున్నారు.