News February 12, 2025
ములుగు: పోస్టల్లో ఉద్యోగ అవకాశాలు

ఇండియన్ పోస్ట్ 21,413 జీడీఎస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వరంగల్ డివిజన్ పరిధిలో 29 ఖాళీలున్నాయి. దీనికి పదవ తరగతి అర్హులు కాగా.. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. మెరిట్ ఆధారం రిక్రూట్మెంట్ చేపడతారు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్లూఎస్ వారికి రూ.100 కాగా మిగితా వారికి ఉచితం. మార్చి 3 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News December 5, 2025
వారు మాత్రమే ఓటు వేసేలా చూడాలి: కలెక్టర్

ఓటరు జాబితాలో ఉన్న వారు మాత్రమే ఓటు వేసేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మొదటి విడత పోలింగ్ ఏర్పాట్లపై శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ పేపర్లను తప్పకుండా పంపించాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
News December 5, 2025
ఎంఈవోలకు కరీంనగర్ కలెక్టర్ కీలక ఆదేశాలు

కరీంనగర్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఎంఈవోలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రతి పదవ తరగతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. ప్రత్యేక అధికారులు పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న స్పెషల్ క్లాసులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు స్లిప్ టెస్టులు నిర్వహిస్తూ బోర్డు పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో కనీసం 20 మంది పిల్లల ఉండాలన్నారు.
News December 5, 2025
NZB: రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలకు ఉమ్మడి జిల్లా క్రీడాకారులు

రాష్ట్రస్థాయి సీనియర్ గర్ల్స్ ఇండియా రౌండ్ విలు విద్య పోటీలకు ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా విలువిద్య కార్యదర్శి గంగరాజు తెలిపారు. నిజామాబాద్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగారంలోని ఖేలో ఇండియా ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్ రాజారం స్టేడియంలో నిర్వహించిన ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు హైదరాబాద్లోని కొల్లూరులో ఈనెల 7న ఆదివారం జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాన్నారు.


