News March 17, 2025
ములుగు: ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ములుగు అదనపు కలెక్టర్ సంపత్ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 19 ఫిర్యాదులు సమర్పించారని ఆయన తెలిపారు. భూసమస్యలు, ఇందిరమ్మ ఇల్లు, ఉద్యోగ ఉపాధి, ఆసరా పెన్షన్లు, ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించామన్నారు.
Similar News
News April 23, 2025
సివిల్స్‌లో వెల్దండ యశ్వంత్‌కు 432వ ర్యాంకు

వెల్దండ మండలం పోచమ్మగడ్డ తండాకు చెందిన యశ్వంత్ నాయక్ సివిల్స్ ఫలితాల్లో 432వ ర్యాంకు సాధించాడు. గత సంవత్సరం సివిల్స్ రాయగా 627వ ర్యాంకు సాధించిన యశ్వంత్ ప్రస్తుతం ఐపీఎస్ శిక్షణ పొందుతున్నాడు. తిరిగి పరీక్ష రాయగా ఈసారి మంచి ర్యాంక్ సాధించాడని తల్లిదండ్రులు ఉమాపతి నాయక్, పద్మ సంతోషం వ్యక్తం చేశారు. యశ్వంత్‌ను కుటంబీకులు, మిత్రులు అభినందించారు.
News April 23, 2025
హయత్‌నగర్: హిజ్రాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

రాత్రి వేళలో ఔటర్ రింగ్ రోడ్ల వెంట ఉంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న హిజ్రాలను హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మెట్ తహశీల్దార్‌కు బైండ్ ఓవర్ చేశారు. ఈ సందర్భంగా సీఐ నాగరాజుగౌడ్ మాట్లాడుతూ.. ఎవరైనా రోడ్ల వెంట అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ వసూళ్లకు పాల్పడినా, వచ్చి పోయేవారికి, వాహనదారులకు ఇబ్బందులకు గురి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News April 23, 2025
ఒంగోలులో TDP నేత హత్య.. లోకేశ్ దిగ్ర్భాంతి

ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య వార్త తనను షాక్‌కు గురిచేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘వీరయ్య చౌదరిని దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపడం దారుణం. యువగళం పాదయాత్రలో నాతోపాటు అడుగులు వేసిన వీరయ్య టీడీపీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేశారు. హంతకులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.