News February 17, 2025

‘ములుగు బస్టాండ్‌లోని పోచమ్మ గుడిని తొలగించొద్దు’

image

ములుగు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల పోచమ్మ గుడిని తొలగించవద్దని ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. బస్టాండ్ వెడల్పు పేరుతో పోచమ్మ గుడిని తొలగించాలనే నిర్ణయాన్ని అధికారులు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. గ్రామ దేవతలు ఒకటైన పోచమ్మ దేవత ఆశీస్సుల వల్ల ములుగు దినదినం అభివృద్ధి చెందుతోందని, ప్రజలు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉంటున్నారని, అలాంటి గుడిని తొలగించడం సరికాదన్నారు.

Similar News

News March 16, 2025

అమరజీవి త్యాగం మరువలేనిది: జిల్లా ఎస్పీ

image

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన మహానీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని జిల్లా ఎస్పీ వి. రత్న తెలిపారు. ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన మహోన్నత వ్యక్తి అని, ఆయన త్యాగం తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోతుందన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు.

News March 16, 2025

రూమ్‌లో ఒంటరిగా చింతిస్తూ కూర్చోవాలా?: కోహ్లీ

image

ఆటగాళ్లు పర్యటనలో ఉన్నప్పుడు వెంట కుటుంబాలను తీసుకెళ్లకూడదని BCCI విధించిన తాజా నిబంధనపై విరాట్ కోహ్లీ స్పందించారు. ‘మ్యాచుల్లో ఎంతో తీవ్రతతో ఆడుతుంటాం. మ్యాచ్ పూర్తికాగానే కుటుంబం చెంతకు చేరడం ఎంతో రిలీఫ్ ఇస్తుంటుంది. అది ఆటగాళ్లకు చాలా అవసరం. అంతేకానీ మ్యాచ్ ముగిశాక రూమ్‌లో ఒంటరిగా చింతిస్తూ కూర్చోవాలా? కుటుంబాలు మాతో ఉండటం ఎంత అవసరమో కొంతమందికి తెలియట్లేదు’ అని పేర్కొన్నారు.

News March 16, 2025

ఉండవల్లి: హడ్కో- సీఆర్డీఏ మధ్య ఒప్పందం

image

ఉండవల్లి నివాసంలో ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో హడ్కో-సీఆర్డీఏ మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణాలకు హడ్కో రూ.11వేల కోట్లు రుణంగా అందించనుంది. జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధులు మంజూరుకు అంగీకారం తెలిపారు. కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠ, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. 

error: Content is protected !!