News April 13, 2024
ములుగు: బీజేపీకి బుద్ధి చెప్పాలి: సీతక్క
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. తన పర్యటనలో భాగంగా గిరిజనులతో కలిసి మంత్రి సీతక్క కాసేపు డోలు వాయించి సందడి చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.
Similar News
News January 8, 2025
MHBD: బాలికపై అత్యాచారం.. కేసు నమోదు
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో బాలికపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోనాపురానికి చెందిన సతీశ్ అనే వ్యక్తి బాలికను అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం ఓ బాలికను నమ్మించి బైకుపై తీసుకెళ్లి ఎంచగూడంలో అత్యాచారం చేశాడని చెప్పారు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలపడంతో వారు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
News January 8, 2025
WGL: ఓ వైపు చైనా మాంజా.. మరో వైపు చైనా వైరస్!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ వైపు చైనా మాంజా.. మరోవైపు చైనా వైరస్‌తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల <<15024024>>జనగామలో చైనా మాంజా<<>>తో నలుగురు గాయపడ్డారు. దీంతో రోడ్డు వెంట వెళ్లే వాహనదారులు భయపడుతున్నారు. అంతేగాక ఇప్పటికే చైనా వైరస్ hMPV ప్రభావంతో జిల్లాలో పలువురు మాస్కులు ధరిస్తున్నారు. జలుబు, జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలని జిల్లా వైద్యాధికారులు సూచించారు.
News January 8, 2025
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి: వర్ధన్నపేట ఎమ్మెల్యే
కాకతీయుల కాలం నాటి ఐనవోలు మల్లికార్జున స్వామి వారి ఆలయం ప్రాశస్త్యం కలిగిందని, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ రవీందర్ రావు అన్నారు. మంగళవారం ఐనవోలు మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాటుపై అన్ని శాఖల అధికారులతో ఆలయ ప్రాంగణంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.