News February 1, 2025

ములుగు: బీజేపీవి దిగజారుడు రాజకీయాలు: సీతక్క

image

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరిస్తుందని మంత్రి సీతక్క మండిపడ్డారు. అసలు సమస్యలను పక్కదారి పట్టించేలా వివాదాలు సృష్టించడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంలో అన్ని అవాస్తవాలనే కేంద్ర ప్రభుత్వం చేర్చిందని, నిరుద్యోగ సమస్య, ఆర్థిక రంగ ఒడిదుడుకులను కప్పిపుచ్చేందుకే సోనియాగాంధీ వ్యాఖ్యలపై వివాదం సృష్టిస్తున్నారన్నారు.

Similar News

News February 1, 2025

కర్నూలు జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్ బాధ్యతల స్వీకరణ

image

శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఎక్కడైనా సమస్యలుంటే తమకు తెలపాలని, వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు.

News February 1, 2025

రాష్ట్ర పోలీసు స్పోర్ట్స్ మీట్‌లో సంగారెడ్డి జిల్లాకు సిల్వర్ మెడల్

image

కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్ర పోలీసు స్పోర్ట్స్ మీట్‌లో సంగారెడ్డి జిల్లా ఐటీ కోర్ టీం గంగేరి సంతోష్ కుమార్ త్వైకాండో సిల్వర్ మెడల్ సాధించారు. కరీంనగర్‌లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1వ వరకు  నిర్వహించిన పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సిల్వర్ మెడల్ సాధించిన సంతోష్‌ను అధికారులు ప్రశంసా పత్రం, సిల్వర్ మెడల్‌ అందజేసి అభినందించారు.

News February 1, 2025

రేపు పెద్దగట్టు ఆలయం వద్ద దిష్టి పూజ

image

పెద్దగట్టు జాతర వద్ద ఆదివారం దిష్టి పూజ నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద జాతరైన పెద్దగట్టు లింగమంతుల ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. ఆదివారం అర్ధరాత్రి దిష్టి పూజ నిర్వహిస్తారని పెద్దగట్టు ఛైర్మన్ నర్సయ్య యాదవ్ తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.