News April 3, 2025

ములుగు: బీజేపీ నాయకుడిపై పొక్సో కేసు

image

వెంకటాపురం BJP అధ్యక్షుడిపై పొక్సో కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ కుటుంబం కూలీ పని కోసం బెస్తగూడెంకి వచ్చారు. MARCH 31న ఓ బాలిక బోరు వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రాజశేఖర్ ఇంటికి తీసుకెళ్తానని బైక్‌ ఎక్కించుకుని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అప్రమత్తమైన బాలిక దూకి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు PSలో ఫిర్యాదు చేశారు. 

Similar News

News April 11, 2025

గంజాయి నివారణకు రైల్వే పోలీసులతో విశాఖ సీపీ సమీక్ష

image

విశాఖ రైల్వే స్టేషన్ గుండా గంజాయి, మాదక ద్రవ్యాల రవాణా పూర్తిగా నిర్వీర్యం చేయడంపై రైల్వే పోలీసులతో విశాఖ సీపీ శంఖబ్రతా బాగ్చి శుక్రవారం సీపీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. రైళ్ల ద్వారా జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రైల్వే ఆస్తుల వద్ద భద్రతా, స్టేషన్ వద్ద స్కానింగ్ మిషన్ల ఏర్పాటు, స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పొదలు తొలగింపు, లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.

News April 11, 2025

కృష్ణా: 15 నుంచి సముద్రంలో వేట నిషేధం

image

సముద్రంలో మత్స్య సంపద సంతానోత్పత్తి నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో వేట నిషేధం అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 61 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధం అమలులో ఉంటుందన్నారు. ఎటువంటి యాంత్రిక పడవల ద్వారా సముద్రంలో వేటకు వెళ్లరాదన్నారు. నిషేదాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు.

News April 11, 2025

రామరాజ్యం తీసుకురావడమే నా కోరిక: CBN

image

AP: రాష్ట్రంలో రామరాజ్య స్థాపనే తన కోరిక అని సీఎం చంద్రబాబు అన్నారు. ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణోత్సవంలో సతీసమేతంగా పాల్గొని ఆయన మాట్లాడారు. ఒంటిమిట్టలో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసి, టూరిజం హబ్‌గా మార్చుతామని చెప్పారు. తిరుమలలో లాగ ఇక్కడ కూడా నిత్య అన్నదానం నిర్వహించాలని టీటీడీ బోర్డును కోరారు.

error: Content is protected !!