News February 28, 2025
ములుగు: బోనస్ ఇంకెప్పుడు ఇస్తారు?

ములుగు జిల్లాలో రైతులకు సకాలంలో వరి ధాన్యం బోనస్ డబ్బులు ఖాతాల్లో జమ కాక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 11,379 మంది రైతులు నుంచి వరి ధాన్యాన్ని సేకరించగా.. 4,885 మంది రైతులకు రూ.15.64 కోట్లు చెల్లించారు. మిగిలిన 6,494 మంది రైతులకు రూ.19.36 కోట్లు చెల్లించాల్సి ఉంది. ధాన్యం కొనుగోలు చేసి ఇన్ని రోజులు అవుతున్నా.. బోనస్ ఇంకెప్పుడు ఇస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.
Similar News
News March 1, 2025
ములుగు: ‘ఆయనకు MLC టికెట్ ఇవ్వాలి’

బీసీ కోటాలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు అశోక్‌కు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలని తాడ్వాయిలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు సతీశ్ కుమార్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చిరంజీవి కోరారు. సామాజిక కార్యకర్త నుంచి జిల్లా అధ్యక్షుడిగా ఎదిగిన వ్యక్తి అశోక్ అని, కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడి నిత్యావసర వస్తువులు అందించారని, బీసీ కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు.
News March 1, 2025
మహబూబాబాద్: ఎగ్ పఫ్ తింటున్నారా.. జర జాగ్రత్త..!

మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి బానోతు దేవేందర్ ఫిర్యాదు మేరకు బ్రహ్మ లింగేశ్వర బేకరీని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రోహిత్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బేకరీలో ఎగ్ పఫ్‌లో అధికంగా ప్లాస్టిక్ ఉందని దేవేందర్ ఫిర్యాదు చేయగా అధికారి తనిఖీలు చేసి నోటీస్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
News March 1, 2025
అదరగొడుతున్న మాజీలు.. మాస్టర్స్ లీగ్‌లో మరో సెంచరీ

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో మాజీలు అదరగొడుతున్నారు. మొన్న ఆస్ట్రేలియా ప్లేయర్ వాట్సన్ సెంచరీతో చెలరేగగా ఇవాళ శ్రీలంక ఆటగాడు ఉపుల్ తరంగ శతకం బాదారు. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు 53 బంతుల్లోనే 102 రన్స్‌తో చెలరేగారు. ఇందులో 6 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో లంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన AUS 217 రన్స్ చేయగా శ్రీలంక మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.