News January 30, 2025
ములుగు: ‘బోనస్’ కోసం రైతుల ఎదురుచూపులు!

ములుగు జిల్లాలో రైతులు వరి ధాన్యం బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. నెలన్నర దాటిన తమ ఖాతాలో బోనస్ జమ కాలేదని వాపోతున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 11,379 మంది రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించగా 4,885 మంది రైతులకు మాత్రమే రూ.15.64 కోట్లు చెల్లించారు. 6,494 మంది రైతులు తమకు రావాలసిన రూ.19.36 కోట్ల బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. బోనస్ ఖాతాలలో జమ చేసి ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
Similar News
News November 23, 2025
URDIPలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు

CSIR-యూనిట్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొడక్ట్స్(URDIP) 3ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తోంది. కెమికల్/ఫార్మాస్యూటికల్ సైన్సెస్లో పీజీ లేదా బ్యాచిలర్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత గల వారు డిసెంబర్ 16న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. వెబ్సైట్: https://urdip.res.in/
News November 23, 2025
సత్యసాయి సేవలు విశ్వవ్యాప్తం: కలెక్టర్ కీర్తి

తల్లికిచ్చిన మాట కోసం పుట్టపర్తి నుంచి ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరించిన మహనీయుడు సత్యసాయి అని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కొనియాడారు. ఆదివారం ఆర్కాట్ తోటలోని సత్యసాయి సేవా సమాజంలో జరిగిన శత జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొని కేక్ కట్ చేశారు. ప్రేమ, సేవా భావంతో బాబా చూపిన మార్గం నేటి సమాజానికి ఆదర్శమని, ఆయన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
News November 23, 2025
జాతీయ వేదికపై కోనసీమ మెరుపులు

భోపాల్లో జరిగిన 52వ జాతీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శనలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రాజెక్టు సత్తా చాటింది. ఇక్కడి నుంచి ఎంపికైన ‘ఈజీ మెషిన్ టూల్’ అత్యంత ప్రజాదరణ పొంది ‘బెస్ట్ పబ్లిక్ రెస్పాన్స్’ అవార్డును కైవసం చేసుకుంది. జిల్లాకు వరుసగా తొమ్మిదోసారి జాతీయ అవార్డు దక్కడం గర్వకారణమని జిల్లా సైన్స్ అధికారి సుబ్రహ్మణ్యం ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా విజేతలను డీఈవో సలీం బాషా ప్రత్యేకంగా అభినందించారు.


