News April 11, 2025

ములుగు, భూపాలపల్లి, MHBD జిల్లాలకు ఎల్లో అలర్ట్

image

రాష్ట్రంలో నేడు, రేపు పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్లు పేర్కొంది. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. నేడు వర్షాలు కురిసే అవకాశముందని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Similar News

News November 22, 2025

HYD: నిద్రావస్థలో.. నిఘా నేత్రం!

image

‘మేము సైతం’ నినాదంతో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల పర్యవేక్షణపై రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్‌ సీతాఎవెన్యూ కాలనీతోపాటు మీర్‌పేట్ MLR కాలనీలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఒక్క కెమెరా వంద మంది పోలీసులతో సమానమైనా వాటి నిర్వహణకు పోలీసులు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఉగ్రవాదుల కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాల వ్యవస్థపై పోలీస్ బాస్‌లు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

News November 22, 2025

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్స్ జీవో విడుదల

image

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో 46ను విడుదల చేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని జీవోలో స్పష్టం చేసింది. SC, ST, BC, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేయనుంది. ST రిజర్వేషన్లు ఖరారయ్యాక SC, BC రిజర్వేషన్లు ఉంటాయి. రేపు సా.6 గంటల్లోపు ఖరారు చేసిన రిజర్వేషన్లను పంచాయతీరాజ్ శాఖకు కలెక్టర్లు అందించనున్నారు.

News November 22, 2025

చిన్న కాళేశ్వరంపై కలెక్టర్ సమీక్ష

image

చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పంట కాలువల భూసేకరణ, సర్వే ప్రగతిపై కలెక్టర్ రాహుల్ శర్మ ఐడీఓసీ కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. కాలువల నిర్మాణానికి ఎంత భూమి అవసరం, ఎంత మంది రైతులు భూములు కోల్పోయారు అనే అంశాలపై చర్చించారు. కాలువల నిర్మాణం వేగంగా సాగేందుకు, అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు.