News April 11, 2025

ములుగు, భూపాలపల్లి, MHBD జిల్లాలకు ఎల్లో అలర్ట్

image

రాష్ట్రంలో నేడు, రేపు పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్లు పేర్కొంది. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. నేడు వర్షాలు కురిసే అవకాశముందని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Similar News

News November 20, 2025

ప్రకాశంలో ఆధార్ తిప్పలు.. కొలిక్కి వచ్చేనా?

image

ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆధార్‌తో పడుతున్న అవస్థలు ఎక్కువేనట. జిల్లాలోని పాఠశాలల్లో 363236 మంది విద్యార్థులు ఉండగా, 302626 మందికి ఆధార్ ద్వారా అపార్ ID వచ్చిందని లెక్క. మిగిలిన 60610 మంది విద్యార్థుల వివరాలు నమోదు కావాల్సిఉంది. కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు కార్డులో తప్పుగా నమోదైన వివరాలను సవరించినా ఆ వివరాలే వస్తున్నాయని దీంతో అపార్ ఐడీకి పెద్ద చిక్కులు వస్తున్నాయట.

News November 20, 2025

కాకినాడ జీజీహెచ్‌లో వృద్ధులకు ‘ఆదివారం’ ప్రత్యేక ఓపీ

image

రాష్ట్రంలోనే తొలిసారిగా కాకినాడ ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్‌)లో వయోవృద్ధుల కోసం ప్రత్యేక ఓపీ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి తెలిపారు. ఈ నెల 23 నుంచి ప్రతి ఆదివారం 65 ఏళ్లు పైబడిన వారికి ఓపీ నంబర్-4లో రిటైర్డ్ ప్రొఫెసర్లు వైద్యం అందిస్తారన్నారు. చికిత్స కోసం వచ్చే వారు ఆధార్‌ కార్డు తీసుకురావాలని, పరీక్షలతో పాటు ఉచితంగా మందులు అందజేస్తామని ఆమె వెల్లడించారు.

News November 20, 2025

రేగుపాలెం: యాక్సిడెంట్.. ఇద్దరికి తీవ్ర గాయాలు

image

ఎలమంచిలి మండలం రేగుపాలెం సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. తుని నుంచి అనకాపల్లి వైపు వెళుతున్న బైక్, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ బోల్తా పడడంతో దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరు ఎలమంచిలి మున్సిపాలిటీ కొత్త ఎర్రవరం గ్రామానికి చెందిన వారిగా సమాచారం. ఈ ఘనటపై పోలీసులు కేసు నమోదు చేశారు.