News April 11, 2025
ములుగు, భూపాలపల్లి, MHBD జిల్లాలకు ఎల్లో అలర్ట్

రాష్ట్రంలో నేడు, రేపు పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్లు పేర్కొంది. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. నేడు వర్షాలు కురిసే అవకాశముందని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Similar News
News April 18, 2025
ఘంటసాల: అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు..!

ఘంటసాల పరిధిలోని పాప వినాశనం వద్ద విషాదం చోటుచేసుకుంది. గురువారం KEB కాలువలో పదో తరగతి విద్యార్థి పవన్ గల్లంతయ్యాడు. దురదృష్టవశాత్తూ ఇదే స్థలంలో 11 ఏళ్ల క్రితం పవన్ తండ్రి కూడా మృతి చెందారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న కుమారుడు కాలువలో కొట్టుకుపోవడంతో తల్లి గుండెలు అవిసేలా రోధిస్తోంది. గ్రామస్థులు పవన్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
News April 18, 2025
పెద్దపల్లి: ఎల్ఆర్ఎస్ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్

రాష్ట్ర పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గురువారం రాత్రి LRS అంశంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్దపెల్లి కలెక్టర్ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీ పాల్గొన్నారు. LRSను పకడ్బందీగా అమలు చేసి, జిల్లాలో వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఫీజు చెల్లించిన దరఖాస్తులకు తక్షణమే క్రమబద్ధీకరణ ప్రొసీడింగ్స్ జారీ చేయాలని ఆదేశించగా, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు.
News April 18, 2025
బారువా: ముస్తాబు అవుతున్న బీచ్ ఫెస్టివల్

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో బారువా బీచ్‌లో ఏప్రిల్ 19, 20వ తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ ఫెస్టివల్‌లో భాగంగా బీచ్‌లో ఆలివ్ రిడ్లీ తాబేలు పిల్లల్ని సముద్రంలోకి విడిచిపెడతారు. ఈ ఫెస్టివల్‌లో బీచ్ వాలీబాల్, వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, బోట్ రైడింగ్ మొదలైన క్రీడల పోటీలు నిర్వహిస్తారు.