News March 19, 2025

ములుగు: మంత్రి సీతక్కకు కొత్త చిక్కులు!

image

మంత్రి సీతక్కకు కొత్త చిక్కులు వెంటాడుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యే సీతక్క పేరుతో వాహనాలకు స్టిక్కర్లు వేసుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ములుగు జిల్లాలో కొందరు వ్యక్తులు మంత్రి సీతక్క వ్యక్తిగత పీఏ, పీఆర్‌వోలమంటూ మండల స్థాయి అధికారుల వద్దకు వెళ్లి చెబుతున్నారని సమాచారం. అలాంటి వారు ఎవరూ లేరని, క్రమశిక్షణ తప్పితే చర్యలు తీసుకుంటామని జిల్లా అధ్యక్షుడు అశోక్ హెచ్చరించారు.

Similar News

News November 17, 2025

వరంగల్, హనుమకొండను కలిపి ఒకే జిల్లా?

image

WGL, HNKను కలిపి ఒకే జిల్లాగా మార్చేందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. నేటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అధికార పార్టీ నేతలు నగరాన్ని ఒకే జిల్లాగా మార్చాలంటూ పదే పదే వేదికల మీద BRSని విమర్శిస్తుండటం తెలిసిందే. ఈ మేరకు గ్రేటర్ WGL‌ను ఒకే జిల్లాగా చేసి, మిగిలిన ప్రాంతాన్ని మరో జిల్లాగా కొనసాగించాలనే నిర్ణయంతో డ్రాఫ్టును జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

News November 17, 2025

నిడిగొండ: దీపాల కాంతుల్లో నిడిగొండ త్రికూటాలయం.!

image

రఘునాథపల్లి మండలం నిడిగొండలోని త్రికూటాలయం ఆదివారం సాయంత్రం జరిగిన కార్తీక దీపోత్సవంతో వెలుగులీనింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, యువత ఉత్సాహంగా పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు. దీపాల కాంతుల్లో త్రికూటాలయం అయోధ్య రామమందిరాన్ని పోలి ఉందనే దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

News November 17, 2025

ఆధార్ లేకున్నా స్కూళ్లలో ప్రవేశాలు!

image

TG: ఆధార్, బర్త్ సర్టిఫికెట్ లేకున్నా పిల్లలు బడిలో చేరొచ్చని విద్యాశాఖ తెలిపింది. గుర్తింపు పత్రాలు లేవని స్కూళ్లలో ప్రవేశాలను నిరాకరించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్, ఇతర సర్టిఫికెట్లు లేవని వలస కార్మికుల పిల్లలను స్కూళ్లలో చేర్చుకోవడం లేదు. ఈ నేపథ్యంలో పత్రాలేవీ లేకున్నా ప్రవేశాలు కల్పించాలని అన్ని స్కూళ్లకు ఆదేశాలిచ్చింది. TC జారీ విషయంలో జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.