News February 24, 2025

ములుగు: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

image

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో వరంగల్, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు, హనుమకొండ జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.

Similar News

News November 19, 2025

మానవ రూపంలో గణేషుడ్ని చూశారా?

image

మనందరికీ ఏనుగు తలతో కూడిన గణపతి మాత్రమే తెలుసు. కానీ ఆయన మానవ రూపంలో ఎలా ఉంటారో చాలామందికి తెలీదు. అయితే వినాయకుడు నరుడిగా దర్శనమిచ్చే ఆలయం తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ ఆది వినాయకుడిగా పూజలందుకునే స్వామివారికి త్రేతా యుగంలో రాములవారు పూజలు నిర్వహించినట్లు స్థల పురాణం చెబుతోంది. అప్పుడు రాముడు సమర్పించిన పిండాలు 4 శివలింగాలుగా మారాయట. వాటినీ ఈ ఆలయంలో చూడవచ్చు. <<-se>>#Temple<<>>

News November 19, 2025

నేటి సామెత.. ‘అదునెరిగి సేద్యం, పదునెరిగి పైరు’

image

సమయం చూసి వ్యవసాయం చేయాలి. అంటే, వాతావరణ పరిస్థితులు, భూమి స్వభావం, నీటి లభ్యత వంటి అంశాలను పరిశీలించి సాగును ప్రారంభించాలి. భూమికి, వాతావరణానికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే పంటను వెయ్యాలి. సమయం దాటితే పంట చేతికి రాదు, శ్రమ కూడా వృథా అవుతుంది. అలాగే ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సమయాన్ని సరిగ్గా అంచనా వేసి, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పడం ఈ సామెత ఉద్దేశం.

News November 19, 2025

త్వరలో ఆధార్ కార్డులో కీలక మార్పులు!

image

ఆధార్ విషయంలో కీలక మార్పులు చేయాలని UIDAI భావిస్తోంది. ఫొటో, QR కోడ్‌తో ఆధార్ కార్డును తీసుకురావడాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వ్యక్తుల డేటా దుర్వినియోగం కాకుండా ఈ దిశగా ఆలోచిస్తోందని తెలిపాయి. కార్డుపై వివరాలు ఎందుకు ఉండాలని, ఫొటో, QR కోడ్ ఉండాలని UIDAI CEO భువనేశ్ కుమార్ అన్నారు. ఆఫ్‌లైన్ వెరిఫికేషన్‌ను నియంత్రించేలా డిసెంబర్‌లో కొత్త రూల్ తీసుకొస్తామని తెలిపారు.