News February 1, 2025
ములుగు: మావోయిస్టు కార్యకలాపాలపై నిఘా పెట్టాలి: స్వాతి లక్రా

మావోయిస్టు కార్యకలాపాలపై నిఘా పెట్టాలని హోంగార్డ్స్, ఆర్గనైజేషన్ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా అన్నారు. ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అడిషనల్ డీజీపీ మాట్లాడుతూ.. జిల్లాలో సైబర్ క్రైమ్, డ్రగ్స్పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. శాంతి భద్రత నియంత్రణలో తీసుకుంటున్న చర్యలపై ఎస్పీ శబరీశ్ పవర్ పాయింట్ ద్వారా డీజీపీకి వివరించారు.
Similar News
News December 27, 2025
2026: ఈ రోజుల్లో బ్యాంకులకు సెలవులు

వచ్చే ఏడాదిలో బ్యాంకుల సెలవుల జాబితాను RBI వెల్లడించింది. ప్రాంతీయ పండుగలను బట్టి తెలుగు రాష్ట్రాల్లో సెలవు రోజులు ఇవే..
✮JAN: 15, 26, ✮FEB: No holidays, ✮MAR:3, 19, 20(AP), 21(TG), 27, ✮APRIL: 1, 3, 14, ✮MAY, 1, 27, ✮JUNE: 25(AP), 26(TG), ✮JULY: No holidays, ✮AUG: 15, 25(AP), 26(TG), ✮SEP: 4, 14, ✮OCT: 2, 20, ✮NOV: 24(TG), ✮DEC: 25.
✮ ప్రతి నెలా ఆదివారం, రెండో, నాలుగో శనివారం అదనం.
News December 27, 2025
గ్రేటర్ తిరుపతికి బ్రేకులు !

గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనను ప్రస్తుతం అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. విజయవాడ, తిరుపతికి గ్రేటర్ హోదా ఇవ్వడంలో కొన్ని సాంకేతిక, చట్టపరమైన సమస్యలు ఉన్నాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. జనగణన పూర్తయ్యే వరకు డీలిమిటేషన్ చేపట్టవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. జనగణన అనంతరం గ్రేటర్ తిరుపతి అంశంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
News December 27, 2025
రూ.22 కోట్ల గంజాయిని తగలబెట్టాం: భద్రాద్రి ఎస్పీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఏడాదిలో 70 కేసుల్లో మొత్తం 221 మందిని అరెస్టు చేయడంతో పాటు వీరి నుంచి కోట్ల విలువగల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఇందులో 5,707 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. సుమారుగా రూ.22 కోట్ల గంజాయిని ఈ ఏడాది తగులబెట్టడం జరిగిందని వార్షిక నివేదిక ద్వారా వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో ఏఎస్పీ, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.


