News March 6, 2025
ములుగు: మావోయిస్టు కొరియర్ల వివివరాలు

వెంకటాపురం మండలం కొత్తపల్లి క్రాస్ వద్ద నలుగురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాడిసే అనిల్, కుర్హమి భామన్, మాడవి సుక్కు, సోడి ఇడుమల@చారి వీరంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందినవారన్నారు. మావోయిస్టు పార్టీకి దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బూట్లు అందజేస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు.
Similar News
News October 17, 2025
రైల్వేలో 8,850 పోస్టులు.. 4 రోజుల్లో దరఖాస్తులు

రైల్వేలో మరో భారీ నియామకానికి రంగం సిద్ధమైంది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీల్లో గ్రాడ్యుయేట్ స్థాయిలో 5,800, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో 3,050 పోస్టులున్నాయి.(పోస్టుల సంఖ్యలో మార్పులు ఉండొచ్చు). ఇంటర్, డిగ్రీ పాసైనవారు అర్హులు. గ్రాడ్యుయేట్ పోస్టులకు ఈనెల 21 నుంచి NOV 20వరకు, UG పోస్టులకు ఈనెల 28 నుంచి NOV 27వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్: https://indianrailways.gov.in/
News October 17, 2025
సిరిసిల్ల: ‘రిజర్వేషన్లపై బీజేపీ నాటకమాడుతోంది’

బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నాటకమాడుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్ అన్నారు. సిరిసిల్లలోని సీపీఎం కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ బీసీ బిల్లుకు మద్దతు ఇస్తూ కేంద్రంలో అడ్డుకుంటుందని మండిపడ్డారు. బీసీ సంఘాలు అన్ని బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తేనే CPM మద్దతుగా పాల్గొంటుందన్నారు. లేనిచో స్వతంత్రంగా బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతుందన్నారు.
News October 17, 2025
ఉట్నూర్: దేవతకు కనుబొమ్మలు సమర్పణ

ఉట్నూర్ మండంలో దండారి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం హీరాపూర్, దంతన్ పల్లి గ్రామస్థులు ఉషేగాం దండారి ఉత్సవాల్లో నిర్వహించిన కేల్క్ దాడి సాంప్రదాయ ప్రకారం మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నారులు, పెద్దలు వారి కనుబొమ్మలు, తల వెంట్రుకలు దేవతకి సమర్పించారు. గోండు గిరిజనులు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఎత్మాసూర్ దేవతకి ఈ మొక్కులు చెల్లిస్తారని పేర్కొన్నారు.