News April 11, 2025
ములుగు: ‘మావో’లకు వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం!

ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలవడం చర్చనీయాంశంగా మారింది. ఆదివాసీ యువజన సంఘం పేరుతో మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్ల వద్ద పోస్టర్లు వెలిశాయి. అడవుల్లో మందు పాతరలు పెట్టి ఆదివాసీలను మావోయిస్టులు అడ్డుకుంటున్నాని, మమ్మల్ని బతకనివ్వరా.? మా ప్రాంతాలపై మీ పెత్తనం ఏంటని పోస్టర్లలో ప్రశ్నించారు.
Similar News
News December 19, 2025
మహిళల్లో మతిమరుపునకు కారణమదే..!

మగవారితో పోలిస్తే ఆడవారిలో అల్జీమర్స్ ముప్పు ఎక్కువ. అయితే దీని వెనుక కారణాన్ని గుర్తించారు కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకులు. అల్జీమర్స్ పేషెంట్స్ రక్తంలోని లిపిడ్స్ను విశ్లేషించగా.. అల్జీమర్స్ ఉన్న మహిళల్లో ఒమేగా3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న లిపిడ్లు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కాబట్టి మహిళలు ఒమేగా 3 కొవ్వులు తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలని లేదా సప్లిమెంట్లు తీసుకోవాలని సూచిస్తున్నారు.
News December 19, 2025
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో ఫుట్బాల్ స్టార్!

స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో హాలీవుడ్ సినిమాలో నటించనున్నారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీ ‘Fast X: Part 2’లో ఆయన కనిపించనున్నారు. రొనాల్డోకు స్వాగతం పలుకుతూ నటుడు టైరెస్ గిబ్సన్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఫాస్ట్ ఫ్యామిలీ’లోకి వెల్కమ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. 2027 ఏప్రిల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.
News December 19, 2025
చిత్తూరు: పెళ్లయి 21 ఏళ్లు.. 14 మంది పిల్లలు.!

చిత్తూరు జిల్లాలో ఓ జంటకు పెళ్లై 21 ఏళ్లలో 14 మంది పిల్లలు పుట్టారంటే నమ్మండి. వీరిలో 7 మంది మగ పిల్లలు, 7 మంది ఆడపిల్లలు జన్మించగా.. వారిలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. GDనెల్లూరు(M) ఆవల్ కండ్రిగకు చెందిన దంపతులకు 21 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో సదరు మహిళ గురువారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 14వ బిడ్డగా మగ పిల్లాడికి జన్మనిచ్చింది.


