News April 4, 2025
ములుగు: యువతపై కన్నేసి ఉంచాలి!

ములుగు జిల్లాలో విద్యార్థులు, యువతపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు మేధావులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. తల్లిదండ్రులు పిల్లల కదలికలు, అలవాట్లు, మొబైల్ వాడకంపై నిఘా పెట్టాలంటున్నారు. జిల్లాలో ఇప్పటికే గంజాయి, బోనోఫిక్స్, మద్యం వంటి మత్తు పదార్థాలకు యువత అలవాటు పడుతున్నారని, వ్యసనంగా మారి అనర్ధాలకు దారి తీయకముందే అదుపు చేయాలని కోరుతున్నారు.
Similar News
News November 25, 2025
లేటెస్ట్ అప్డేట్స్

* TG సచివాలయంలో ప్రారంభమైన క్యాబినెట్ భేటీ.. పంచాయతీ ఎన్నికల సన్నద్ధత, విద్యుత్ శాఖ సంబంధిత అంశాలపై చర్చ
* స్థానికసంస్థల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో మ.2.15కు విచారణ
* మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్న వైసీపీ చీఫ్ జగన్.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు క్యాంప్ ఆఫీసుకు రాక
* నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్, రాము, జనార్దన్ రావుతో పాటు నలుగురికి డిసెంబర్ 9 వరకు రిమాండ్ పొడిగింపు
News November 25, 2025
ఇంట్లోని ఈ వస్తువులతో క్యాన్సర్.. జాగ్రత్త!

ఇంట్లో వినియోగించే కొన్ని వస్తువులు క్యాన్సర్ కారకాలుగా మారుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దోమల కాయిల్స్, రూమ్ ఫ్రెష్నర్స్, నాన్ స్టిక్ పాత్రలు, ప్లాస్టిక్ డబ్బాలు, టాల్కమ్ పౌడర్, క్యాండిల్స్ పొగ & సిగరెట్ స్మోక్, తలకు వేసుకునే రంగుతో క్యాన్సర్ ప్రమాదం ఉందని తెలిపారు. ఇంట్లో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవడం, వీటిని వాడటాన్ని తగ్గించడం/ ప్రత్యామ్నాయాలను వాడటం శ్రేయస్కరమని సూచించారు.
News November 25, 2025
మదనపల్లెలో KG టామాటా రూ.66

మదనపల్లె టమాటా మార్కెట్లో ధరలు భారీగా పెరిగాయి. వారం రోజులుగా రేట్లు బాగా ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లె మార్కెట్కు మంగళవారం 156 మెట్రిక్ టన్నుల టమాటాలు వచ్చాయి. దిగుబడి తక్కువగా ఉండడంతో కాయల కొనుగోలుకు వ్యాపారాలు పోటీపడ్డారు. దీంతో 10కిలోల మొదటిరకం బాక్స్ రూ.660, రెండో రకం రూ.620, 3వ రకం రూ.540 చొప్పున అమ్ముడుపోయినట్లు మార్కెట్ సెక్రటరీ జగదీశ్ వెల్లడించారు.


