News May 7, 2025
ములుగు: రేపే BRS రజతోత్సవ సభ

WGL ఎల్కతుర్తిలో నిర్వహించనున్న BRS రజతోత్సవ సభకు మరో ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. 10 నుంచి 15 లక్షల మందితో 1,250 ఎకరాల్లో రేపు ఈసభ జరగనుంది. 500మందికి సరిపడే విధంగా బాహుబలి వేదికను నిర్మించారు. 10లక్షల మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ల బాటిల్లు, రెండున్నరవేల మందికి పైనే వాలంటర్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. వెయ్యి ఎకరాలను 5 జోన్లుగా విభజించి పార్కింట్ ఏర్పాటు చేశారు. సభకు మీరు వెళ్తున్నారా? కామెంట్
Similar News
News April 14, 2026
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం: చిత్తూరు కలెక్టర్

అంబేడ్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామని కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. చిత్తూరు దర్గా సర్కిల్‌లో నిర్వహించిన జయంతిలో ఆయన పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన చూపిన బాటలో నడిస్తే దేశాభివృద్ధి సాధ్యమన్నారు.
News April 14, 2026
పెరిగిన మిర్చి రేటు.. రైతులకు అదృష్టం

TG: ఈ ఏడాది మిర్చి రైతులను అదృష్టం వరించింది. అన్ని రకాల మిర్చి ధరలు భారీగా పెరిగాయి. తాజాగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సాధారణ రకం తేజా మిర్చి క్వింటా రూ.21వేలు, ఏసీ మిర్చి రూ.21,580 పలికింది. చైనా నుంచి ఆర్డర్లు పెరగడంతో డిమాండ్ అధికమైనట్లు వ్యాపారులు చెబుతున్నారు. కాగా టమాటా మిర్చి, ఎల్లో మిర్చి ధరలు రూ.40-50వేలు పలికిన <<19251332>>విషయం<<>> తెలిసిందే.
News April 14, 2026
GNT: అమరావతి శాటిలైట్ మ్యాప్‌ల విడుదల

ప్రపంచ బ్యాంకు అమరావతి శాటిలైట్ మ్యాప్‌లను విడుదల చేసింది. ఇందులో 2024, 2026 సంవత్సరాల మధ్య వచ్చిన మార్పులను స్పష్టంగా చూపించింది. రాజధాని ఫేజ్-1 పనులకు రూ. 30 వేల కోట్లకు పైగా నిధులు అందుబాటులోకి వచ్చాయి. దీనికి గ్లోబల్ ఫండింగ్ సంస్థల నుంచి కూడా భారీ మద్దతు లభిస్తోంది. నిధుల రాకతో అమరావతి నిర్మాణం కేవలం ప్రణాళికలకే పరిమితం కాకుండా ఆచరణ దశకు చేరుకుంది. క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం అయ్యాయి.


