News April 8, 2025

ములుగు: ‘వేసవి క్రీడల శిక్షణకు దరఖాస్తు చేసుకోండి’

image

ములుగు జిల్లాలో మే 1 నుంచి నెల రోజుల పాటు నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాలలో 14 ఏళ్ల బాల బాలికలకు వివిధ క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు గాను అర్హులైన వ్యాయామ ఉపాధ్యాయులు, జాతీయ స్థాయి క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి తుల రవి తెలిపారు. శిక్షకులకు రూ.4 వేల గౌరవ వేతనం అందజేస్తామని, ఆసక్తి గల వారు ఈ నెల 15లోగా జిల్లా సంక్షేమ భవన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News February 26, 2026

ఆరోగ్యం కోసం 10 నిమిషాల మార్నింగ్ రొటీన్‌

image

ఉదయాన్నే 10 నిమిషాలు కేటాయించి డైజెషన్, నాడీ వ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. తొలుత 3 నిమిషాలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. తర్వాత 3 నిమిషాల పాటు స్ట్రెచింగ్స్ లేదా నడకతో గట్ మొబిలిటీ మెరుగుపడుతుంది. 2 నిమిషాల పాటు గోరువెచ్చని నీరు తాగితే బాడీ రీహైడ్రేట్ అవుతుంది. మరో 2 ని.లు ఎలాంటి స్ట్రెస్ లేకుండా టిఫిన్ చేయడానికి ముందు ప్రశాంతంగా ఉండాలి.

News February 26, 2026

కోదాడ: కర్ల రాజేష్ మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం

image

పోలీస్ లాకప్‌లో మృతి చెందిన కోదాడకు చెందిన కర్ల రాజేష్ మృతదేహానికి ఈ నెల 27న రీ-పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఎంఆర్‌పీఎస్ ఆందోళనలు, జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్య బృందం ఆధ్వర్యంలో కోదాడలో ఈ ప్రక్రియ జరగనుంది.

News February 26, 2026

అల్లూరి: గంజాయి నిర్మూళనకు ‘ఆపరేషన్ సంయుక్త’

image

విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి ఆధ్వర్యంలో జరిగిన అంతర్రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లో అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ పాల్గొన్నారు. ఏజెన్సీలో గంజాయి ‘జీరో కల్టివేషన్’ సాధించిన విధానాన్ని ఒడిశా అధికారులకు వివరించారు. సరిహద్దుల్లో అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఉమ్మడిగా ‘ఆపరేషన్ సంయుక్త’ చేపట్టాలని నిర్ణయించారు.