News February 11, 2025
ములుగు: వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి: డిప్యూటీ డీఎంహెచ్వో

ఈనెల 12 నుంచి జరగనున్న జాతరలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఐటిడిఏ డిప్యూటీ డీఎంహెచ్వో క్రాంతి కుమార్ అన్నారు. ఈరోజు కొండాయి, ఐలాపురం గ్రామాల్లో నిర్వహించబోయే వైద్యశిబిరాలను ఆయన పరిశీలించారు. ఐలాపురంలో ఇటీవలే నిర్మించిన కంటైనర్ ఆసుపత్రిని సందర్శించారు. Dyడిఎంహెచ్వో మాట్లాడుతూ.. జాతర సమయంలో రోగులకు చికిత్స అందించేందుకు మందులు నిల్వ చేసుకోవాలన్నారు.
Similar News
News October 16, 2025
NGKL: మంత్రాల మాటున మాయ.. భర్త హత్య

NGKL జిల్లా శ్రీపురానికి చెందిన రాములును తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని OCT 12 భార్య మానస, ప్రియుడు సురేశ్ హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. రాములు ఇంట్లో 6 నెలల క్రితం <<18015644>>బంగారం<<>> చోరీ కావడంతో సురేశ్ మంత్రశక్తితో కనిపెడతానని ఫ్యామిలీకి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో మానసతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇంట్లో విషయం తెలియడంతో గొడవలు జరిగాయి. భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసి హతమార్చారు.
News October 16, 2025
నెవ్వర్ బిఫోర్ టేస్ట్!

అనంతపురం జిల్లాకు ప్రత్యేకత తీసుకువచ్చే ఆహారం రాగి సంగటి. పోషక విలువలు, రుచితో కూడిన ఈ వంటకం జిల్లాలో ప్రసిద్ధి పొందింది. రాగి సంగటిని సాధారణంగా నాటు కోడి కూర లేదా పెరుగు, పచ్చడితో ఆస్వాదిస్తారు. ఆరోగ్యానికి సైతం మేలు చేసే ఈ భోజనం ఇప్పుడు నగరాల్లోనూ ప్రాచుర్యం పొందుతోంది. రాగి సంగటికి ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువే అని చెప్పుకోవచ్చు.
#ప్రపంచ ఆహార దినోత్సవం
News October 16, 2025
WGL: ముందు ఇన్ఛార్జి పదవి పాయే..!

తెలంగాణలో మంత్రుల కీచులాట తారాస్థాయికి చేరింది. మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కొనసాగిన కొండా సురేఖ.. అక్కడి వారి ఫిర్యాదుతో ఆ పదవి పోయింది. ప్రస్తుతం ఏ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి పోస్టు లేకుండా ఉండిపోయారు. ఓఎస్డీ డిస్మిస్, అదుపులోకి తీసుకునేందుకు పోలీసుల ప్రయత్నం.. ప్రభుత్వం పైనే తిరుగుబాటు చేసే వరకు వెళ్లింది. మరోపక్క ఆమె మంత్రి పదవికి రాజీనామాకు సిద్ధమైనట్లు అనుచురులు చర్చించుకుంటున్నారు.