News February 11, 2025

ములుగు: వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి: డిప్యూటీ డీఎంహెచ్వో

image

ఈనెల 12 నుంచి జరగనున్న జాతరలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఐటిడిఏ డిప్యూటీ డీఎంహెచ్వో క్రాంతి కుమార్ అన్నారు. ఈరోజు కొండాయి, ఐలాపురం గ్రామాల్లో నిర్వహించబోయే వైద్యశిబిరాలను ఆయన పరిశీలించారు. ఐలాపురంలో ఇటీవలే నిర్మించిన కంటైనర్ ఆసుపత్రిని సందర్శించారు. Dyడిఎంహెచ్వో మాట్లాడుతూ.. జాతర సమయంలో రోగులకు చికిత్స అందించేందుకు మందులు నిల్వ చేసుకోవాలన్నారు.

Similar News

News February 8, 2026

కాకినాడ కొత్త DROగా తిప్పేనాయక్

image

కాకినాడ DROగా డాక్టర్ తిప్పేనాయక్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన వెంకటరావు సింహాచలం దేవస్థానం ఈఓగా బదిలీ అవ్వడంతో అనంతపురంలో ఉన్న తిప్పేనాయక్ ఇక్కడికి నియమితులయ్యారు. గతంలో 2024లో కూడా ఆయన ఇక్కడే పనిచేశారు. బాధ్యతలు చేపట్టిన ఆయనను రెవెన్యూ అధికారులు కలిసి అభినందనలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

News February 8, 2026

విద్యుత్ సమస్యలా? సీఎండీకి ఫోన్ చేయండి!

image

విద్యుత్ సమస్యల పరిష్కారానికి ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం ప్రారంభించినట్లు జిల్లా SE రాజేశ్వరి తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు 8688400499 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విద్యుత్ సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరారు.

News February 8, 2026

మంచిర్యాల: డబ్బుకు లొంగం.. ఓటును అమ్మం!

image

మున్సిపల్ ఎన్నికల వేళ మంచిర్యాల జిల్లా ముల్కల్ల గ్రామంలో ఓ యువకుడు ఆదర్శంగా నిలిచాడు. 16వ డివిజన్‌కు చెందిన కొత్తపల్లి శ్రీరామ్మూర్తి తన ఇంటి ముందు “మా ఓటు మద్యానికి, డబ్బుకు అమ్మబడదు” అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. “మార్పు కోపం నా అడుగు” అనే నినాదంతో కేవలం నిజాయితీపరులకే ఓటేస్తామని స్పష్టం చేశాడు. ఈ ఫ్లెక్సీ ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.