News August 9, 2024
ములుగు: శిశువు విక్రయం..ఇద్దరిపై కేసు నమోదు

శిశువును విక్రయించిన, కొనుగోలు చేసిన వారిపై కేసు నమోదు చేసినట్టు ఏటూరునాగారం ఎస్సై తాజుద్దీన్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన ఆడశిశువును తండ్రి జంపయ్య.. రామన్నగూడెం గ్రామానికి చెందిన సుధాకర్‌కు విక్రయించిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయం ఇటీవలే వెలుగులోకి రావడంతో, కొనుగోలు చేసిన సుధాకర్, విక్రయించిన జంపయ్యపై ప్రొటెక్షన్ చిల్డ్రన్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News November 24, 2025
వరంగల్: చిన్నారి హత్య కేసులో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష

మూడేళ్ల పాప ఫాతిమా సబాను హత్య చేసిన కేసులో నిందితురాలు హజీరా బేగం, ఆమె సహచరుడు సయ్యద్ యూసుఫ్‌కు యావజ్జీవ కారాగార శిక్షను వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలాగీతాంబ సోమవారం విధించారు. వివాహేతర సంబంధానికి చిన్నారి అడ్డు అవుతుందని 2022 ఏప్రిల్ 23న ఇద్దరూ కలిసి క్రూరంగా హతమార్చినట్లు సాక్ష్యాధారాలతో రుజువైనందున కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
News November 24, 2025
వరంగల్ కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ రద్దు

పరిపాలనాపరమైన కారణాల వల్ల సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రకటించారు. జిల్లా ప్రజలు వినతిపత్రాలతో కలెక్టరేట్‌కు రావొద్దని ఆమె సూచించారు. జిల్లా ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, తదుపరి కార్యక్రమాన్ని తెలియజేస్తామని ఆమె వివరించారు.
News November 22, 2025
వరంగల్‌లో ముగ్గురు సీఐల బదిలీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఇన్‌స్పెక్టర్లకు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఓ. రమేష్ (మామూనూర్ ఇన్‌స్పెక్టర్)- వీఆర్‌కు, ఈ. శ్రీనివాస్ (ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్)- మామూనూర్ పోలీస్ స్టేషన్‌కు, ఏ. ప్రవీణ్(వీఆర్ ఇన్‌స్పెక్టర్)- ఐటీ కోర్ సెల్‌కు బదిలీ అయ్యారు.


