News February 14, 2025
ములుగు: సదరం స్లాట్ బుకింగ్‌కు అంతరాయం

ములుగు జిల్లాలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో వారం రోజుల పాటు సదరం క్యాంపులను నిలిపివేయనున్నట్లు సంబంధిత జిల్లా అధికారులు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా యూడీఐడీ ద్వారా దివ్యాంగత నిర్ధారణ పరీక్షలు జరుపుటకు కార్యాచరణ జరగడంతో పాటు, ప్రస్తుతం సదరం ద్వారా అమలవుతున్న ఏడు రకాల దివ్యాంగత్వాల స్థానంలో మరో 14 సేవలను చేర్చి త్వరలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అధికారులు తెలిపారు.
Similar News
News December 5, 2025
నిర్మల్: బ్యాంకులు మెరుగైన సేవలు అందించాలి

శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి కన్సాలిటేటివ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పాల్గొన్నారు. బ్యాంకర్లు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్‌తో పాటు పలువురు బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
News December 5, 2025
DOB సర్టిఫికెట్లపై ఆ ప్రచారం ఫేక్: PIB

డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి 2026 ఏప్రిల్ 27 తుది గడువుగా నిర్ణయించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను PIB Fact Check ఖండించింది. వాట్సాప్‌లో వైరలవుతోన్న ఈ సమాచారం అవాస్తవమని స్పష్టం చేసింది. ప్రభుత్వం అలాంటి నోటిఫికేషన్ లేదా గడువును జారీ చేయలేదని పేర్కొంది. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను షేర్ చేయొద్దని పౌరులకు సూచించింది.
News December 5, 2025
పెద్దపల్లి: పట్టాలపై కారు.. తప్పిన పెను ప్రమాదం

పెద్దపల్లి పట్టణంలోని కూనారం రైల్వే గేటు వద్ద శుక్రవారం భారీ ప్రమాదం తప్పింది. గేటు ఒక్కసారిగా అకస్మాత్తుగా లాక్ అవ్వడంతో కారు పట్టాలపై నిలిచిపోయింది. రైలు హారన్ వినిపించడంతో కారులో ఉన్నవారితో పాటు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే ట్రైన్ల రాకపోకలు నిలిపివేశారు. 30 నిమిషాల పాటు శ్రమించి గేటు మరమ్మతులు చేశారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమవ్వడంతో ప్రమాదం తప్పింది.


