News February 14, 2025
ములుగు: సదరం స్లాట్ బుకింగ్‌కు అంతరాయం

ములుగు జిల్లాలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో వారం రోజుల పాటు సదరం క్యాంపులను నిలిపివేయనున్నట్లు సంబంధిత జిల్లా అధికారులు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా యూడీఐడీ ద్వారా దివ్యాంగత నిర్ధారణ పరీక్షలు జరుపుటకు కార్యాచరణ జరగడంతో పాటు, ప్రస్తుతం సదరం ద్వారా అమలవుతున్న ఏడు రకాల దివ్యాంగత్వాల స్థానంలో మరో 14 సేవలను చేర్చి త్వరలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అధికారులు తెలిపారు.
Similar News
News March 23, 2025
Dy.CM పవన్ కళ్యాణ్‌ని సన్మానించిన బుడగ జంగాలు

కర్నూలు జిల్లా పూడిచెర్లకి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి బేడ బుడగ జంగం రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ సన్మానించారు. క్యాబినెట్, అసెంబ్లీలో బుడగ జంగలకు ఎస్సీ హోదా కల్పించేందుకు ఆమోదం తెలిపిన కూటమి నాయకులకు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, MP బైరెడ్డి శబరికు కృతజ్ఞతలు తెలిపారు.
News March 22, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓ పెట్రోలింగ్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి:SP✓ పాల్వంచ: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్✓ ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ కొత్తగూడెంలో 3వ రోజుకు చేరుకున్న జర్నలిస్టుల దీక్ష ✓ పులుసు బొంత ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే పాయం ✓ కిన్నెరసాని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి: ఎమ్మెల్యే కూనంనేని ✓ మణుగూరు రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు
News March 22, 2025
కెప్టెన్సీకి హీథర్ నైట్ రాజీనామా

ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీకి హీథర్ నైట్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ECB ధ్రువీకరించింది. 9 ఏళ్లపాటు సేవలందించినందుకు థ్యాంక్స్ అని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 2016లో కెప్టెన్‌గా ఎంపికైన హీథర్ ఏకంగా 199 మ్యాచ్(టెస్టు, వన్డే, టీ20)లకు నాయకత్వం వహించారు. ఆమె సారథ్యంలోనే ఇంగ్లండ్ 2017 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. హీథర్ 3 ఫార్మాట్లలో 7వేలకు పైగా రన్స్, 84 వికెట్లు తీశారు.