News February 26, 2025
ములుగు: సభలు, సమావేశాలపై నిషేధం

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ములుగు జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి, ఈనెల 28 సాయంత్రం నాలుగు గంటల వరకు బహిరంగ సభలు, సమావేశాలపై నిషేధం అమలు చేస్తూ కలెక్టర్ దివాకర ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల పేర్కొన్న ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై బీఎన్ఎస్ సెక్షన్ 153 ప్రకారం చర్యలు తీసుకుంటామని, ప్రజలు ప్రభుత్వ ఉత్తర్వులను పాటించాలని పేర్కొన్నారు.
Similar News
News October 19, 2025
జూబ్లీ బైపోల్: ఇప్పటికి 127.. ఉన్నది ఒక్కరోజే!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్లు జోరందుకున్నాయి. అధికారులు ఊహించని విధంగా నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు 127 మంది పోటీచేస్తామంటూ ముందుకువచ్చారు. నామినేషన్లు వేసేందుకు తుది గడువు 3 రోజుల (21వ తేదీ వరకు) సమయమున్నా.. ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉంది. 19 ఆదివారం, 20న దీపావళి కావడంతో మంగళవారం ఆఖరి రోజు. ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి నామినేషన్ వేస్తామని పలువురు ప్రకటించడంతో దీనిపై ఆసక్తి నెలకొంది.
News October 19, 2025
లక్ష్మీదేవికి కమలాలు సమర్పిస్తున్నారా?

లక్ష్మీదేవి పూజలో కమలాలు సమర్పించడం అత్యంత శ్రేష్ఠమని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. దీనికి కారణం.. క్షీరసాగర మథనం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు, ఆమె చేతిలో కమలాన్ని ధరించి ఉండటం. కమలం శుద్ధి, జ్ఞానం, సంపదకు ప్రతీక. పూజలో ఈ పూలు సమర్పించడం ద్వారా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన పూజ చేసినట్లు అవుతుంది. తద్వారా ఆమె అనుగ్రహం లభించి, ఇంట ధన, ధాన్య, ఐశ్వర్యాలు స్థిరంగా ఉంటాయని విశ్వసిస్తారు.
News October 19, 2025
పల్నాడు: HYD-అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే.. మార్గం ఇదే.!

కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం హామీల భాగంగా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ హైవే.. పల్నాడు జిల్లాలోని పలు గ్రామాల మీదుగా వెళ్లనుంది. ఈ హైవే ద్వారా కేవలం 3 గంటల్లో అమరావతి చేరుకునేలా డీపీఆర్ను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. పల్నాడు జిల్లాలో ఈ హైవే పులిపాడు, దాచేపల్లి, ముత్యాలంపాడు, మాచవరం, తురకపాలెం, మొర్జంపాడు గ్రామాల మీదుగా వెళ్తుందని తెలిపారు.