News January 25, 2025

ములుగు: సీఎస్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

image

4 నూతన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. నూతన పథకాల ప్రారంభ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ములుగు కలెక్టర్ దివాకర టిఎస్ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి మండలంలోని ఒక గ్రామంలో పథకాలను లాంచనంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

Similar News

News February 26, 2026

హార్వర్డ్‌ను హైదరాబాద్‌కు తీసుకొస్తున్నాం: CM రేవంత్

image

TG: హార్వర్డ్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని గ్రూప్-1,2 ఆఫీసర్ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో CM రేవంత్ వెల్లడించారు. ‘ఇక్కడి నుంచి హార్వర్డ్‌కు వెళ్లేందుకు చాలామందికి కష్టమవుతోంది. అందుకే MCHRD-హార్వర్డ్ మధ్య ఓ ఒప్పందం చేసుకుంటున్నాం. వాళ్లే ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ క్లాసెస్ చెబుతారు’ అని రేవంత్ వివరించారు. ఇక ఆఫీసర్లంతా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని సూచించారు.

News February 26, 2026

SRCL: ‘పదో తరగతి కీలకం.. ఒత్తిడి వీడాలి’

image

పదో తరగతి విద్యార్థుల జీవితంలో ఈ దశ అత్యంత కీలకమని, పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ సూచించారు. గురువారం ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆమె, పదో తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలని, ప్రశ్నలకు సమాధానాలు రాసిన తర్వాత మరోసారి సరిచూసుకోవాలని సూచించారు.

News February 26, 2026

శ్రీకాకుళం: పొన్నాడ వంతెన వద్ద వ్యక్తి దారుణ హత్య?

image

శ్రీకాకుళం వాంబే కాలనీకి చెందిన పైల మోహన్ రావు (40) పొన్నాడ వంతెన సమీపంలో గురువారం శవమై కనిపించారు. గత రెండు రోజులుగా ఆచూకీ లేని మోహన్‌రావు కోసం కుటుంబ సభ్యులు గాలిస్తుండగా, రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. మృతుని తలపై తీవ్ర గాయాలు ఉండటంతో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.