News March 13, 2025

ములుగు: స్కూల్ బస్సులు భద్రమేనా!

image

ములుగు జిల్లాలోని వివిధ ప్రైవేటు పాఠశాలలకు చెందిన స్కూల్ బస్సుల భద్రతపై తల్లిదండ్రుల ఆందోళనలు నెలకొంది. సరైన ఫిట్నెస్ లేని బస్సులు, అనుభవం లేని డ్రైవర్లులతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని గుబులు చెందుతున్నారు. మద్యం మత్తులో, మరమ్మతుకు వచ్చిన పాఠశాల బస్సులు నడిపి ప్రమాదాలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించకపోవడం గమనార్హం.

Similar News

News March 15, 2026

గర్భాశయ క్యాన్సర్ నివారణకు టీకా రక్షణ: డీఎంహెచ్‌ఓ

image

మహిళల్లో ప్రాణాంతకంగా మారుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించేందుకు HPV టీకాలు వేయించాలని HNK DMHO అప్పయ్య పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ మొదటిది కాగా, గర్భాశయ క్యాన్సర్ రెండో స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 14 ఏళ్లలోపు బాలికలకు ఈ టీకా వేయించడం ద్వారా 93 నుంచి 100 శాతం వరకు క్యాన్సర్ నివారణ సాధ్యమని వైద్య అధ్యయనాలు చెబుతున్నాయన్నారు.

News March 15, 2026

ASF: డొమెస్టిక్ సిలిండర్లు వ్యాపారానికి వినియోగిస్తే కఠిన చర్యలు

image

గృహ అవసరాలకు కేటాయించిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వ్యాపార, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హరిత హెచ్చరించారు. ఆదివారం ASF జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా ఇతర అధికారలతో కలిసి హాజరయ్యారు. ప్రస్తుతం జిల్లాలో ఎల్‌పీజీ, పెట్రోల్ కొరత లేదని స్పష్టం చేశారు.

News March 15, 2026

NGKL: ఉపకరణాల కోసం ఎస్సీలు దరఖాస్తులు చేసుకోవాలి: కలెక్టర్

image

ఎస్సీ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా బ్యాంకు అనుసంధానంతో ఎస్సీలకు వివిధ రకాల ఉపకరణాలు అందజేయడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. 2025-26 యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంపు కంట్రోల్లకు సబ్సిడీలు అందించనున్నారు. 21 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు.