News February 12, 2025
ములుగు: స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739331053115_1047-normal-WIFI.webp)
ములుగు జిల్లాలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయన్న సంకేతాలతో అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మూడు మండలాల చొప్పున గ్రామపంచాయతీ ఎన్నికలకు రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ట్రైనింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేసేలా సమాయత్తం అవుతున్నారు.
Similar News
News February 12, 2025
తిరుపతిలో దారుణ హత్య.. నిందితుడు అరెస్టు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739362938722_51948758-normal-WIFI.webp)
తిరుపతి శ్రీనివాసం వద్ద జరిగిన అంకయ్య (30) హత్యకు సంబంధించి నిందితుడిని ఈస్ట్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పని వద్ద జరిగిన గొడవలో అంకయ్యను బలమైన రాడ్డుతో కొట్టి సతీశ్ పారిపోయాడు. అంకయ్యను మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 8న మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు.
News February 12, 2025
పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి: డీపీవో
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739362819615_51702158-normal-WIFI.webp)
పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని ములుగు జిల్లా పంచాయతీ అధికారి దేవరాజు అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు, నియమాలకు లోబడి నిష్పక్షపాతంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు రామకృష్ణ, రహిముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
News February 12, 2025
ఈ ఏడాదే తల్లికి వందనం, బడ్జెట్‌లో నిధులు: సీఎం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739358701689_81-normal-WIFI.webp)
AP: ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనలు, బడ్జెట్ కూర్పుపై మంత్రి పయ్యావుల, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను ఈ ఏడాది నుంచి ప్రారంభించాలని, బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని తెలిపారు. అలాగే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల సమతూకంపైనా చర్చిస్తున్నారు.