News June 23, 2024

ములుగు: స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ సస్పెండ్

image

ములుగు SB విభాగంలో విధులు నిర్వహిస్తున్న శ్రీధర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు మల్టీజోన్ IG రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా.. 2022-23లో KMM 2 టౌన్ CIగా ఉన్న సమయంలో ఓ వ్యక్తిని బెదిరించి తప్పుడు సాక్ష్యాలతో కేసు నమోదు చేశారు. 2022లో నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కోర్టును తప్పుదోవ పట్టించినట్లు ఫిర్యాదు వచ్చింది. ఈమేరకు విచారణ జరిపి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Similar News

News October 8, 2024

వరంగల్: పండుగ సందర్భంగా 6556 ప్రత్యేక రైళ్లు

image

భారతీయ రైల్వేలు అక్టోబర్ 6 నాటికి దుర్గాపూజ, దీపావళి, ఛత్ పూజల సమయంలో ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు 6556 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రౌల్వే ప్రకటించినది. ప్రతి సంవత్సరం పండుగల సమయంలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్యను గణనీయంగా పెంచినట్లు రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్ తెలియజేశారు.

News October 8, 2024

HYD నుంచి ఓరుగల్లుకు బాట!

image

దసరా పండుగతో HYD ఖాళీ అవుతోంది. ఉద్యోగాల కోసం నగరానికి వచ్చిన ఓరుగల్లు ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ క్రమంలో ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సుల కోసం క్యూ కట్టారు. దీంతో ఉప్పల్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నప్పటికీ ప్రయాణికుల సంఖ్యకు సరిపోవడం లేదు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరూ వస్తే కామెంట్ చేయండి.

News October 8, 2024

HNK: ‘పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించింది’

image

తల్లిదండ్రులు లేకపోయినా నిరుత్సాహ పడలేదు. పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన బొల్లెపల్లి శ్రీజకు తల్లిదండ్రులు లేరు. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో పోటీ పరీక్షలు రాసి మల్టీ జోనల్ 22వ ర్యాంక్ సాధించింది. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఈవోగా నియామక పత్రం అందుకుంది.