News February 11, 2025
ములుగు: 10 పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలి : కలెక్టర్

రానున్న పదవ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ఎంఈవోలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎంఈవోలు, హెచ్ఎంలు కృషి చేయాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారిని ప్రోత్సహించాలన్నారు. తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి, ఇంటి వద్ద చదివేలా కృషి చేయాలన్నారు.
Similar News
News March 21, 2025
బిల్లులు ఆమోదం.. నాగర్ కర్నూల్ ఎంపీ హర్షం

తెలంగాణ శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించబడింది. ఈ చారిత్రక నిర్ణయాన్ని పురస్కరించుకొని, ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఎంపీ డాక్టర్ మల్లు రవి సహచర ఎంపీలతో కలిసి బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి సంబరాలు నిర్వహించారు. రాహుల్ గాంధీ ఎన్నికల హామీ నెరవేరిందని, సామాజిక న్యాయ సాధనంలో ఇది కీలక ముందడుగని అన్నారు.
News March 21, 2025
‘లబ్ధిదారులకు అదనపు సహాయం రూ.6.19 కోట్లు విడుదల’

జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గృహ నిర్మాణం కోసం అదనపు ఆర్థిక సహాయం కింద 4,240 మంది లబ్ధిదారులకు రూ.6.19 కోట్ల నిధులను విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం తెలిపారు. క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందికి ఎఫ్‌టీఓ విడుదల చేసిన లబ్ధిదారులు గృహ నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు.
News March 21, 2025
‘తాగు నీటి సమస్యకు పర్యవేక్షక సెల్ ఏర్పాటు’

గ్రామీణ ప్రాంత ప్రజలు వేసవిలో తాగునీటి కొరత సమస్యలను తెలుసుకొని పరిష్కరించుటకు రాజమహేంద్రవరం జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారి కార్యాలయంలో పర్యవేక్షక సెల్ ఏర్పాటు చేశారు. ఈమేరకు జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారి బి.వెంకటగిరి ప్రకటనలో తెలిపారు. తాగునీటి సమస్యలను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 వరకు 91001 21190 నంబరుకు తెలియజేయాలన్నారు.