News March 8, 2025
ములుగు: ‘2 నెలలుగా మిషన్ భగీరథ నీరు రావడం లేదు’

ములుగు మండలం జంగాలపల్లి క్రాస్ రోడ్డు వద్ద 2 నెలల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నీరు సరఫరా కాక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గ్రామ పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా కలెక్టర్ దృష్టి సారించి మిషన్ భగీరథ నీళ్లు వచ్చేలా కృషి చేయాలని కోరారు.
Similar News
News November 19, 2025
జేసీకి ఫిర్యాదు.. చక్కదిద్దే ప్రయత్నాల్లో అధికారులు!

ప్రకాశం జేసీకి ఫిర్యాదు చేస్తే చాలు, అలా పరిష్కారం కావాల్సిందే అంటున్నారు దివ్యాంగులు. సోమవారం నిర్వహించిన కలెక్టర్ మీకోసం కార్యక్రమానికి దివ్యాంగులు తమ సమస్యను మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం అందించే త్రీ వీలర్ బైక్ పొందేందుకు, ఎల్ఎల్ఆర్ లైసెన్స్ అవసరం. దీనికై రవాణా శాఖ కార్యాలయం వద్ద కొందరు లాబీయింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు జేసీ వద్ద వాపోయారు. ఆయన ఆదేశాలతో లాబీయింగ్‌కు చెక్ పడిందట.
News November 19, 2025
రాజమౌళి-మహేశ్‌బాబు ‘వారణాసి’పై వివాదం!

రాజమౌళి-మహేశ్‌బాబు ‘వారణాసి’ సినిమాపై వివాదం మొదలైంది. సుబ్బారెడ్డి అనే డైరెక్టర్ ఇదే టైటిల్‌ను రెండేళ్ల క్రితం TFPCలో రిజిస్టర్ చేయించారు. ఆ టైటిల్‌ను SSMB29 టీమ్ ఉపయోగించడంతో ఆయన TFPCలో ఫిర్యాదు చేశారు. అయితే రాజమౌళి తెలుగు మినహా ఇతర భాషల్లో ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే గ్లింప్స్‌లోనూ మూవీ టైటిల్‌ను తెలుగులో ఇవ్వలేదని సమాచారం. మరి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.
News November 19, 2025
అన్నమయ్య జిల్లా DCHS సస్పెండ్

మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసు రాష్ట్రంలో సంచలనమైంది. ఈ కేసులో అన్నమయ్య జిల్లా DCHS డా.ఆంజనేయులును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మదనపల్లె గ్లోబల్ ఆస్పత్రి కేంద్రంగా కిడ్నీ రాకెట్ ముఠా పనిచేసింది. వాళ్లతో ఆంజనేయులుకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనను సస్పెండ్ చేసి డా.లక్ష్మీప్రసాద్ రెడ్డిని ఇన్ఛార్జ్ డీసీహెచ్ఎస్గా నియమించారు.


