News March 8, 2025
ములుగు: ‘2 నెలలుగా మిషన్ భగీరథ నీరు రావడం లేదు’

ములుగు మండలం జంగాలపల్లి క్రాస్ రోడ్డు వద్ద 2 నెలల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నీరు సరఫరా కాక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గ్రామ పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా కలెక్టర్ దృష్టి సారించి మిషన్ భగీరథ నీళ్లు వచ్చేలా కృషి చేయాలని కోరారు.
Similar News
News January 14, 2026
త్వరలో రాష్ట్రంలో 10వేల పోస్టులకు నోటిఫికేషన్!

TG: రాష్ట్రంలో త్వరలో వైద్యారోగ్యశాఖలో 10వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఇప్పటికే సీఎం రేవంత్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు.
News January 14, 2026
సింగపూర్ పాస్‌పోర్ట్ నం.1..! మన స్థానం ఎంత..?

మోస్ట్ పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్ లిస్ట్-2026లో ఇండియా 80వ స్థానంలో(2025లో 85) నిలిచింది. మన PPతో వీసా లేకుండా 55 దేశాలకు వెళ్లొచ్చని హెన్లీ ఇండెక్స్ తెలిపింది. 192 కంట్రీస్ యాక్సెస్‌తో సింగపూర్ No.1.. 188 యాక్సెస్‌తో జపాన్, సౌత్ కొరియా No.2 ప్లేసెస్‌లో ఉన్నాయి. డెన్మార్క్, స్విట్జర్లాండ్, స్వీడన్, స్పెయిన్, లగ్జెంబర్గ్ 3లో నిలిచాయి. లిస్ట్‌లో USA 10, PAK 98ర్యాంకు పొందగా, AFG 101తో చివరన ఉంది.
News January 14, 2026
ఖమ్మం: BRS-YCP, కాంగ్రెస్-TDP మిక్స్‌డ్ పాలిటిక్స్

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఏపీ-తెలంగాణ పార్టీల కలయిక ఆసక్తి రేపుతోంది. ఈ నెల 7న KTR పర్యటనలో BRS జెండాలతో పాటు YCP జెండాలు కనిపించడం చర్చనీయాంశమైంది. మరోవైపు మంచుకొండ ప్రాజెక్టు వద్ద మంత్రి తుమ్మల సభలో కాంగ్రెస్‌తో పాటు TDP జెండాలు రెపరెపలాడాయి. పొరుగు రాష్ట్రంలో ప్రభావం చూపే పార్టీల మద్దతుదారులు ఇక్కడ స్థానిక పార్టీలతో కలిసి అంటకాగడం ఖమ్మం రాజకీయాల్లో దుమారం రేపుతోంది.


